Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ సంగీత కళాకారిణి సావి కల్రాకు గౌరవ డాక్టరేట్

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (20:21 IST)
ఇండియన్ మీడియా వర్క్స్ ప్రెసిడెంట్ జాన్ అమలన్ సిఫార్సు మేరకు గత 30 ఏళ్లుగా కళా, సంగీత రంగంలో ఎన్నో విజయాలు సాధించిన ప్రముఖ కళాకారిణి సావి కల్రాకు ఆస్ట్రేలియాలోని సెయింట్ థెరిసా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. తాజాగా చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో "డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్" సవి కల్రాకు డాక్టరేట్‌ పట్టాను అందజేశారు. 
 
ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌ కేంద్రంగా సెయింట్ మదర్ థెరిసా విశ్వవిద్యాలయం సేవలు అందిస్తూ వస్తుంది. యునైటెడ్ స్టేట్స్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ద్వారా గుర్తింపు పొందిన ఈ విశ్వవిద్యాలయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని డిస్టాంట్ యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్‌తో అనుబంధంగా ఉంది. 
 
ఎన్నో ఏళ్లుగా విద్యారంగంలో విశిష్ట సేవలందిస్తున్న సెయింట్ థెరిసా యూనివర్సిటీ.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న వారిని గుర్తించాలని నిర్ణయించింది. దీని ప్రకారం, గత 10 సంవత్సరాలుగా వివిధ అనుబంధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సెయింట్ మదర్ థెరిసా విశ్వవిద్యాలయం తరపున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నారు. ఇందులోభాగంగా, గత 30 ఏళ్లుగా కళా, సంగీత రంగాల్లో ఎన్నో విజయాలు సాధించిన శ్రీమతి సావి కల్రాను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించారు.
 
కాగా, ఇండియన్ మీడియా వర్క్స్ (ఐఎండబ్ల్యూ) ప్రెసిడెంట్ జాన్ అమలన్ సిఫార్సుపై శ్రీమతి సవి కల్రా పేరును ఎంపిక చేశారు. ఈమె గత 30 సంవత్సరాలుగా కళలు, సంగీతం రాణించారు. 1989 పెయింటింగ్ పోటీలో ఉత్తమ కళాకారిణిగా అవార్డు పొందారు. అలాగే, 1988 బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నారు. 
 
రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచే మంచి కార్యక్రమం కోసం 2015 మారథాన్‌లో పాల్గొన్నారు. "ఇండియా టర్న్స్ పింక్ ఆర్గనైజేషన్" అంబాసిడర్‌గా కూడా కొనసాగారు. సంవత్సరం 2018 ఫిబ్రవరి 3న నన్ను "క్వీన్ ఆఫ్ మద్రాస్" జ్యూరీకి పిలిచారు. సంవత్సరం 2018, మార్చి 8న, తనకు జేసీఎస్ అండ్ స్కైలైన్ ద్వారా "క్రియేటివ్ డైవర్సిటీ పర్సనాలిటీ" బిరుదు లభించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ గడ్డలో టీడీపీ పుట్టింది.. పూర్వ వైభవం ఖాయం.. బాబు

తెలంగాణకు మంచి పునాది ఉంది.. ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు

భక్తులకు వాటర్ బాటిళ్లు ఆ ధరకే విక్రయించాలి.. టీటీడీ వార్నింగ్

ఏపీ నుంచి ఆర్ఆర్ఆర్.. ఆ జాబితాలో అగ్రస్థానం.. పక్కాగా పనిచేశారు..

చంద్రబాబు-రేవంతన్నల భేటీ.. ఆ స్కీమ్‌పై చర్చ.. కారు వరకు వచ్చి సాగనంపారు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిజమైన భారతీయుడు ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్: ఎస్.జె సూర్య (Video)

రూ.1,000 కోట్ల క్లబ్‌కు చేరువలో ప్రభాస్ "కల్కి 2898 AD"

పిల్లల ఫోటోలు సోషల్ మీడియాలోనా.. పేరెంట్స్ అలెర్ట్: సాయి ధరమ్ తేజ్

ప్రభాస్‌కు పెళ్లి చేయాలని మాకూ వుంది.. కానీ టైం రావాలి: శ్యామలాదేవి

రాజ్ తరుణ్‌తో నాకెలాంటి సంబంధం లేదు.. హీరోయిన్ మాల్వి మల్హోత్రా

తర్వాతి కథనం
Show comments