Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రోగ్‌ స్ట్రిక్స్‌- టీయుఎఫ్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్‌

రోగ్‌ స్ట్రిక్స్‌- టీయుఎఫ్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసిన అసుస్‌
, మంగళవారం, 15 మార్చి 2022 (19:52 IST)
ఆసుస్‌ ఇండియా, రిపబ్లిక్‌ ఆఫ్‌ గేమర్స్‌ (ఆర్‌ఓజీ) నేడు తమ ఉత్పత్తి శ్రేణిని నూతన ల్యాప్‌టాప్‌ల ఆవిష్కరణతో విస్తరించింది. దీనిలో అత్యాధునిక 12వ తరపు ఇంటెల్‌ కోర్‌ హెచ్‌-సిరీస్‌ ప్రాసెసర్లు, ఏఎండీ రిజెన్‌ 6000 సిరీస్‌ మొబైల్‌ ప్రాసెసర్లు ఉన్నాయి.


గేమింగ్‌ అనుభవాలను మరింతగా పెంచే రీతిలో తీర్చిదిద్దిన ఈ ల్యాప్‌టాప్‌లు ఉత్పాదకతను వృద్ది చేయడంతో పాటుగా వ్యక్తిగతీకరించిన ఎంపికలను వినియోగదారులకు అందిస్తాయి. ఈ నూతన శ్రేణి ల్యాప్‌టాప్‌లలో ఆర్‌ఓజీ స్ర్టిక్స్‌ స్కార్‌ 15/17, ఆర్‌ఓజీ స్ట్రిక్స్‌ జీ15/17, అసుస్‌ టీయుఎఫ్‌ ఎఫ్‌ 15/17, టీయుఎఫ్‌ ఏ15/17 ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికత కలిగిన ఈ గేమింగ్‌ మెషీన్లు గేమర్లకు వైవిధ్యతను తీసుకురావడంతో పాటుగా గేమ్‌ ప్లేను తరువాత స్థాయికి తీసుకువెళ్తాయి.

 
ఈ నూతనశ్రేణి గేమింగ్‌ కంప్యూటర్లను గురించి అర్నాల్డ్‌ సు, బిజినెస్‌ హెడ్‌, కన్స్యూమర్‌ అండ్‌ గేమింగ్‌ పీసీ, సిస్టమ్‌ బిజినెస్‌ గ్రూప్‌, అసుస్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘అసుస్‌ వద్ద మేము మా వినియోగదారులకు ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణ, వైవిధ్యత నడుమ సారుప్యతలను సృష్టిస్తూ వీలైనంత ఉత్తమమైన అనుభవాలను గేమింగ్‌ పరంగా అందించాలని కోరుకుంటున్నాము.

 
ఈ నూతన టీయుఎఫ్‌, స్ట్రిక్స్‌ శ్రేణి  పోటీతత్త్వం కలిగిన గేమర్లకు అదనపు ప్రయోజనం అందిస్తే, క్యాజువల్‌ ప్లేయర్లకు పూర్తి నూతన స్థాయి అనుభవాలు సొంతమవుతాయి. నేటి తరపు జీవన శైలికి తగినట్లుగా ఉండే ఈ ల్యాప్‌టాప్‌లు పని మరియు ఆటలు నడుమ సౌకర్యవంతంగా మారేందుకు తోడ్పడతాయి. ఇవి భారతీయ గేమింగ్‌ కమ్యూనిటీలో సరికొత్త గేమింగ్‌ అనుభవాలను అందించనున్నాయని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నమ్మకంగా పనిచేస్తున్నాడని ఇంట్లో పెట్టుకుంటే యజమాని కుమార్తెను లొంగదీసుకుని...