Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాట్స్ టెంపాబే విభాగంలో ఆధ్వర్యంలో నాట్స్ గణిత వెబినార్: విద్యార్థుల నుంచి విశేష స్పందన

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (17:35 IST)
టెంపాబే: అమెరికాలో తెలుగు విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ గణిత వెబినార్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలికుటర్ భాను ప్రకాశ్‌తో నిర్వహిస్తున్న ఈ వెబినార్స్‌కు వేలమంది విద్యార్ధులు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం అవుతున్నారు. నాట్స్ టెంపాబే విభాగంతో పాటు న్యూజెర౩౦: లోని ఓం సాయి బాలాజీ ఆలయం సంయుక్తంగా ఈ గణిత సదస్సులను ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నాయి.
 
తాజాగా జరిగిన సదస్సులో చిన్నచిన్న మెళకువళతో గణితంలో ఎలా పరిణితి సాధించవచ్చనే దానిని భాను ప్రకాశ్ విద్యార్ధులకు వివరించారు.. ఎక్స్‌ప్లోరింగ్ ఇన్ఫినిటీస్ పేరుతో తాను ఇస్తున్న శిక్షణ వల్ల ఎంతటి కష్టమైన సమస్యలనైనా సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. విద్యార్ధులు అడిగిన అనేక ప్రశ్నలకు కూడా భాను ప్రకాశ్ ఈ సదస్సులో సమాధానం ఇచ్చారు. విద్యార్ధులు తమ మేథస్సుకు ఎలా పదను పెట్టుకోవచ్చు.. గణితం వల్ల మన మెదడు ఎంత చురుకుగా పనిచేస్తుందనే దానిని చక్కగా వివరించారు.
 
ఈ వెబినార్‌కు దాదాపు 1500 మందికి పైగా విద్యార్ధులు ఆన్‌లైన్ ద్వారా అనుసంధానమయ్యారు. ప్రతి వారం సరికొత్త అంశాలతో నాట్స్ ఈ వెబినార్స్ నిర్వహిస్తోంది. ఈ వెబినార్ నిర్వహణలో నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ ఉపాధ్యక్షుడు (ఫైనాన్స్‌,మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్  రాజేష్ కాండ్రు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, నాట్స్ టెంపా బే విభాగం సమన్వయకర్త  ప్రసాద్ ఆరికట్ల, నాట్స్ టాంపాబే చాప్టర్ జాయింట్ కోఆర్డినేటర్ సురేశ్ బొజ్జ,ఈవెంట్స్ కో ఛైర్ నవీన్ మేడికొండ, హెల్ప్ లైన్ ఛైర్ సుమంత్ రామినేనితో పాటు ఓం శ్రీ సాయి బాలాజీ ఆలయానికి చెందిన  సూర్యనారాయణ మద్దుల, వంశీ తమన, విశాలి, దీపా మదన్ గోపాల్, రమేశ్ తడువాయి తదితరులు ఈ వెబినార్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు.
 
ఈ వెబినార్‌కు మద్దతు అందించిన నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ అధ్యక్షుడు విజయ్ శేఖర్ అన్నే, నాట్స్ నాయకులు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళీ మేడిచెర్లలకు నాట్స్ టెంపాబే విభాగం కృతజ్ఞతలు తెలియజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మిథున్ రెడ్డికి కొత్త పరువు - దిండ్లు - ప్రొటీన్ పౌడర్ - కిన్లే వాటర్ - దోమతెర కావాలి...

మేనల్లుడుతో ప్రేమ - భర్త - నలుగురు పిల్లలు వదిలేసి పారిపోయిన వివాహిత!!

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

తర్వాతి కథనం
Show comments