Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెంతులతో బెల్లీ ఫ్యాట్‌కు చెక్.. ఎలా? (video)

Webdunia
మంగళవారం, 30 మార్చి 2021 (10:35 IST)
చాలా మంది పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు. అప్పటికీ చాలామందిలో నిరాశే కనిపిస్తుంటుంది. 
 
అయితే బరువు తగ్గేందుకు మన వంట గదిలోనే అనేక ఔషధాలు ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే అలాంటి ఔషధాల్లో మెంతులు ఒకటి. మెంతులు తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు. మెంతి గింజల్లో అనేక పోషక లక్షణాలు ఉన్నాయి. అవి సూపర్ ఫ్యాట్ బర్నర్‌గా పనిచేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.
 
మెంతి గింజల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్, ఐరన్, విటమిన్ ఎ, డి పుష్కలంగా ఉన్నాయి. మీరు మెంతి గింజలను క్రమంగా ఉపయోగిస్తే బరువు సులువుగా తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. శరీరంలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది. మెంతులు తినడం వల్ల డయాబెటిస్ రోగులకు చాలా ఉపయోగం కలుగుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది.
 
ముఖ్యంగా, బెల్లీ ఫ్యాట్‌కు మెంతులు ఎంతగానో మేలుచేస్తాయి. తక్కువ కేలరీల టీ తాగాలనుకుంటే మెంతి టీ ఉత్తమం. ఈ టీ ప్రత్యేకత ఏమిటంటే బెల్లీ ఫ్యాట్ (బొడ్డు చుట్టూ కొవ్వు)ను తగ్గించే గుణాలు ఉన్నాయి. ఒక చెంచా మెంతులు, దాల్చిన చెక్క, కొద్దిగా అల్లం నీటిలో వేసి మరిగించి తాగాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువగా ఫ్యాట్ బర్న్ అవుతుంది. దీంతో బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలా ప్రతిరోజూ తాగితే బరువు కూడా సులభంగా తగొచ్చని గృహ వైద్యులు చెబుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అత్యాచారం.. ఆ తర్వాత అక్కడే మద్యం సేవించిన నిందితులు

మాలి దేశంలో పెట్రేగిన ఉగ్రవాదులు - ఏపీ కార్మికుడు కిడ్నాప్

పెళ్లికి నిరాకరించిన పెద్దలు - ప్రకాశం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

విజయ్‌కు ఎన్డీయే ఆహ్వానం.. స్నేహాస్తం అందించిన మాజీ సీఎం

ఆనంద నిలయం నమూనాలో మాంసాహార హోటలా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

తర్వాతి కథనం
Show comments