Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రాచీన కళా వైభవాన్ని గుర్తు చేసిన నాట్స్: ఆన్‌లైన్ ద్వారా తోలు బొమ్మలాట ప్రదర్శన

ప్రాచీన కళా వైభవాన్ని గుర్తు చేసిన నాట్స్: ఆన్‌లైన్ ద్వారా తోలు బొమ్మలాట ప్రదర్శన
, సోమవారం, 22 మార్చి 2021 (22:42 IST)
న్యూజెర్సీ: తెలుగు కళలకు ఎప్పుడూ నీరాజనం పట్టే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. ఈసారి ఆన్ లైన్ వేదికగా తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేయించింది. కాకినాడకు చెందిన ప్రసిద్ధ శ్రీ నటరాజ నిలయ చర్మ చిత్ర కళా ప్రదర్శన కమిటీ వారు సుందరకాండ ఘట్టాన్ని తోలు బొమ్మలాట ద్వారా ప్రదర్శించారు. దీనిని వందలాది మంది తెలుగు వారు ఆన్ లైన్ ద్వారా వీక్షించారు.
 
ప్రాచీన కళలను ఆదరించి వాటిని భావి తరాలకు కూడా పరిచయం చేయాలనే సంకల్పంతో నాట్స్ తోలుబొమ్మలాట ప్రదర్శన ఏర్పాటు చేసింది. రామాయణంలో అత్యంత గొప్పదిగా చెప్పుకునే సుందరకాండ ఘట్టాన్ని తోలుబొమ్మల కళాకారులు ఎంతో అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ తోలుబొమ్మలాట దినోత్సవం (మార్చ్ 21) సందర్భంగా నాట్స్ న్యూజెర్సీ విభాగం ఈ మహత్తర కార్యక్రమం ఏర్పాటుకు సంకల్పించింది.
 
నాట్స్ న్యూజెర్సీ సమన్వయకర్త సురేశ్ బొల్లు, న్యూ జెర్సీ కల్చరల్ చైర్ శేషగిరిరావు (గిరి) కంభంమెట్టు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచెర్లలు తోలుబొమ్మలాటను ఆదర్శించాల్సిన ఆవశ్యకతను వివరించారు. నాట్స్ ఎప్పుడూ తెలుగు కళలను ప్రోత్సహిస్తుందని దానిలో భాగంగానే ఆన్‌లైన్ ద్వారా తోలు బొమ్మలాట ప్రదర్శన చేపట్టిందని నాట్స్ బోర్డ్ డైరెక్టర్ మోహనకృష్ణ మన్నవ తెలిపారు.
webdunia
తోలుబొమ్మలాట మధ్యలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు,నటులు శివారెడ్డి ముఖ్య అతిధి గా విచ్చేసి పప్పెట్ షో ద్వారా అలరించారు. విశాఖ శ్రీ మాతా మ్యూజిక్ కంపెనీ ఈ తోలుబొమ్మలాట ఆన్‌లైన్ ప్రదర్శనకు తన వంతు సహకారం అందించింది. ఎన్ఆర్ఐ స్ట్రీమ్స్ ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు న్యూ జెర్సీ చాప్టర్ కృతజ్ఞతలు తెలియచేసింది.
 
సురేష్ బొల్లు మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నాట్స్ బోర్డ్ డైరెక్టర్స్‌కు, న్యూ జెర్సీ చాప్తర్ సభ్యులకు, నాట్స్ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (వెబ్) సుధీర్ మిక్కిలినేనిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసారు. భవిష్యత్తులో కూడా సమాజహితం, కళల కోసం చేపట్టే ప్రతి  కార్యక్రమానికి తమ వంతు సాయం చేస్తామని నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శేఖర్ అన్నే తెలియచేస్తూ, న్యూ జెర్సీ చాప్టర్‌ను అభినందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెడ్ యాపిల్స్ కంటే గ్రీన్ యాపిల్స్ ఉత్తమమైనవా?