Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రెన్ కోసం నాట్స్ 60 వేల ఆహారం ప్యాకెట్లు

చికాగో, అమెరికా: పేద పిల్లల కోసం తయారుచేసిన ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం కోసం చికాగో తెలుగు అసోసియేషన్, నాట్స్ వాలంటీర్లు తమవంతు సాయం అందించారు. అరోరాలోని ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ(FMSC) కోస

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (20:40 IST)
చికాగో, అమెరికా: పేద పిల్లల కోసం తయారుచేసిన ఆహార పదార్థాలను ప్యాక్ చేయడం కోసం చికాగో తెలుగు అసోసియేషన్, నాట్స్ వాలంటీర్లు తమవంతు సాయం అందించారు. అరోరాలోని ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ(FMSC) కోసం సుమారు 59,122 ఆహార పొట్లాలు కట్టారు. సరైన తిండి దొరకక బాధపడుతున్న ప్రపంచంలోని వేలాది మంది పేద పిల్లలకు ఈ ఆహారం చేరుతుంది. నాట్స్ డైరెక్టర్స్ రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు, సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగె సారథ్యంలో జరిగిన ప్యాకింగ్ కార్యక్రమం విజయవంతమైంది. మొత్తం 90 మంది స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రవి ఆచంట, ప్రవీణ్ మోటూరు మాట్లాడుతూ... దానం చేసే సంస్కృతిని యువతకు నేర్పడంతో పాటు సమాజ సేవలో భాగస్వాములను చేయడంలో ప్రోత్సాహం అందించాలని అన్నారు. అవసరాల్లో ఉన్న వారికి అందించే చిన్న సాయం ఎంతటి మేలు చేకూరుస్తుందో, ఎలాంటి ప్రభావం చూపిస్తుందో యువతకు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. సీటీఏ, నాట్స్ వాలంటీర్లకు ఈ ఈవెంట్ ఎల్లప్పుడూ సంతృప్తిని ఇస్తుందని... సీటీఏ, నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో ఎనలేని సంతృప్తిని ఇచ్చే వాటిలో ఇది కూడా ఒకటని నాగేంద్ర వేగె అన్నారు. సహాయ సహకారాలు అందించిన సీటీఏ, నాట్స్‌కు ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ సంస్థ అభినందనలు తెలిపింది.
 
90 మంది వాలంటీర్లు ఎంతో కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారని కొనియాడింది. సీటీఏ, నాట్స్‌కు చెందిన సభ్యులు శ్రీనివాస్ చుండూ, ప్రసాద్ తాళ్లూరు, రాంగోపాల్ దేవరపల్లి, శైలేంద్ర సుంకర, వంశీ మన్నె, ఉమా దేవరపల్లి, మాధవి తిప్పిశెట్టి, రాణి వేగె, మాధవి ఆచంట, అజయ్ రెడ్డి, శ్రీనివాస్ తలశిల, శేషు ఉప్పలపాటి, కౌసల్య గుత్తా, రాజశేఖర్ కందుల, నందు, రవి రామముని, శ్రీనివాస్ ఆచంట, నాగభూషణం భీంశెట్టి, వెంకట్ తొక్కల, అనిల్ మోపర్తి, రమేష్ కొలుకులూరి, రమేష్ తిప్పిశెట్టి తదితరులందరూ ఈ ఈవెంట్ కోసం చాలా శ్రమించారు.
 
ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్ అనేది ఒక లాభాపేక్ష లేని స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ ఆర్గనైజేషన్ ఆకలితో అలమటించే వారి కోసం ఆహారాన్ని అందిస్తూ, మానసికంగానూ బలం చేకూర్చేలా సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పౌష్టికాహారం అందని పిల్లల కోసం ప్రత్యేకంగా ఆహారాన్ని తయారుచేస్తుంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనాథ శరణాలయాలు, స్కూళ్లు, ఆస్పత్రులు, పేదరికంలో ఉన్న వారికి తోడ్పాటునందించే సంస్థలకు చేరవేస్తుంది.  పేద పిల్లల ఆకలి తీర్చేందుకు తమవంతు సాయం అందించి, దాతృత్వాన్ని చాటుకున్న సీటీఏ, నాట్స్ వాలంటీర్లను FMSC ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ప్రశంసా పత్రాలు కూడా అందజేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

తర్వాతి కథనం
Show comments