Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ ఒక్క పచ్చడితో 300 వ్యాధులు దూరం..

మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోనే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు వాటిని మనం వంటల్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు ముప్పు కూడా తప్పిపోతుంది. సాధారణంగా మునక్కాయలతో వేపుడు, సాంబారు చేసుకుంటుంటా

drumstick chutney
Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2017 (19:33 IST)
మన చుట్టూ ఉన్న ఆకులు, కాయల్లోనే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఎన్నో మొండి వ్యాధులను నయం చేయగలిగిన లక్షణాలు ఉన్నాయి. అంతేకాదు వాటిని మనం వంటల్లో భాగం చేసుకోవడం వల్ల కొన్ని వ్యాధులు ముప్పు కూడా తప్పిపోతుంది. సాధారణంగా మునక్కాయలతో వేపుడు, సాంబారు చేసుకుంటుంటారు. అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు. అయితే మునక్కాయ ఆకులతో ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
 
అన్ని కాలాల్లో దొరికే ఈ మునగాకును ఆహారంలో భాగంగా చేసుకుంటే మనం తరచూ ఎదుర్కొనే చిన్న చిన్న వ్యాధులను కాపాడుతుంది. ఇందులో విటమిన్-ఎ అధికంగా ఉండడం వల్ల కంటికి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. బరువు, లావు తగ్గాలనుకునే వారికి మునగాకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్-సి ఎముకలను బాగా బరపరుస్తుంది. విటమిన్ ఎ-సినే కాకుండా కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఆకులను పచ్చడి లేదా కూరచేసుకుని తింటే జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే మధుమేహం..రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
 
అయితే ఇన్ని ఔషధ గుణాలున్న మునగాకు పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం..ఒక పాన్ లో కొంచెం నూనె పోసి వేడిగా అయిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి, ధనియాలు, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా వేయించి తీసి ఒక బౌల్‌లో పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత రెండు కప్పుల మునగాకుకు అదే పాన్ లో కొంచెం నూనె వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించి పక్కనే పెట్టుకోవాలి. 
 
మిక్సీ జారులో ముందు వేయించిన దినుసలన్నీ వేసి మిక్సీ పట్టి ఆ తరువాత మునగాకు కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో కొంచెం నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాళింపు పెట్టి రుబ్బుకున్న పచ్చడి అందులో వేసి కలిపి దించేయాలి. ఇలా చేసిన పచ్చడిని తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అందరూ రక్తదానం చేయాలి - విశాఖపట్నం లో 3కె, 5కె, 10కె రన్‌ చేయబోతున్నాం : నారా భువనేశ్వరి

Fishermen Aid: మత్స్యకర చేయూత పథకం ప్రారంభం.. చేపల వెళ్లకపోయినా..?

IED attack: పాకిస్థాన్‌కు బిగ్ షాక్: 10 మంది సైనికులు హతం.. వీడియో వైరల్

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sri Vishnu: శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ చిత్రం డేట్ ప్రకటన

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

తర్వాతి కథనం
Show comments