Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 యేళ్లు.. మోడీ ఏమన్నారంటే...

అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి సోమవారంతో 125 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు.

Advertiesment
స్వామి వివేకానంద చికాగో ప్రసంగానికి 125 యేళ్లు.. మోడీ ఏమన్నారంటే...
, సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:35 IST)
అమెరికాలోని చికాగోలో స్వామి వివేకానంద చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి సోమవారంతో 125 యేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగించారు. 
 
ఆయన మాట్లాడుతూ... ముంబైపై ఉగ్రవాదులు విరుచుకుపడటానికి మన అసమర్థతే కారణమన్నారు. 1983లో వివేకానందుడు చికాగోలో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారని గుర్తు చేసిన ఆయన, 'యంగ్ ఇండియా - న్యూ ఇండియా' నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. 
 
స్వామి వివేకానంద ఆలోచనల నుంచి స్ఫూర్తిని పొంది కలలను సాకారం చేసుకునే దిశగా యువత ముందడుగు వేయాలని ఆయన కోరారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే 2001, సెప్టెంబర్ 11వ తేదీన ముంబైపై ముష్కరులు దాడికి తెగబడ్డారని విమర్శించారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉంటే వందలాది ప్రాణాలు మిగిలేవని అభిప్రాయపడ్డారు. 
 
అలాగే, స్వామి వివేకానంద చికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవం సందర్భంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వామి వివేకానందకు ఘనంగా నివాళులర్పించారు. 1893లో చికాగోలో స్వామివివేకానంద చారిత్రక ప్రసంగానికి 125 ఏళ్లు నిండిన సందర్భంగా ఆయనకు హృదయ పూర్వకంగా నివాళులర్పిస్తున్నానని మమత ట్వీట్ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర్యాన్ స్కూల్‌ ఘటన : మీడియాపై హర్యానా పోలీసుల జులుం... ప్రిన్సిపాల్ అరెస్ట్