అలాంటి యువతే కావాలి... స్వామి వివేకానంద సందేశం
స్వామి వివేకానంద భవిష్యత్తు తరాలకు మార్గదర్శి. ఆయన సందేశాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి. కొన్నింటిని గుర్తు చేసుకుందాం. ‘లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి. లేవండి! మేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి! ఇకపై న
స్వామి వివేకానంద భవిష్యత్తు తరాలకు మార్గదర్శి. ఆయన సందేశాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి. కొన్నింటిని గుర్తు చేసుకుందాం. ‘లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకూ విశ్రమించకండి. లేవండి! మేల్కొనండి!.. మిమ్మల్ని మీరు మేల్కొల్పుకొని ఇతరులను మేల్కొల్పండి! ఇకపై నిద్రించకండి!.. మీరు మరణించే లోపే జీవిత పరమావధిని సాధించండి. లేవండి!మేల్కొనండి!.. గమ్యం చేరేవరకూ ఎక్కడా నిలవకండి.. ఎప్పటికీ జాగృతంగానే ఉండండి.. బలమే జీవితం, బలహీనతే మరణం.. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్ప మనసున్న యువత ఈ దేశానికి కావాలి..’
‘ఆధునిక యువతపైనే నాకు విశ్వాసం ఉంది.. నేను నిర్మించిన ఆదర్శాన్ని దేశమంతా వ్యాప్తి చేసేది యువతే.. యువత ముందు బలిష్టులు, జవ సంపన్నులు, ఆత్మ విశ్వాసుల, రుజువర్తనులు కావాలి. ఇలాంటి వారు వందమంది ఉన్నా చాలు, ఈ ప్రపంచాన్నే మార్చేయవచ్చు..’
‘మీరంతా మహత్కార్యాలు సాధించడానికే జీవించామని విశ్వసించండి.. బలం, శక్తి మీలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి.. ఎంతో విశ్వాసంతో లేచి నిలబడండి.. ధైర్యంగా బాధ్యతను మీ భుజ స్కంధాలపై వేసుకోండి.. భవిష్యత్తుకు మీరే బాధ్యులమని తెలుసుకోండి.. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. క్రమంగా ఘనమైన ఫలితాలు వస్తాయి.. సాహసంగా పని చేయండి..’
‘తమ సర్వస్వాన్ని త్యాగం చేసి, దేశం కోసం తమ జీవితాలను ఆహుతి చేసే యువత మనకు కొందరు కావాలి.. దేశ ప్రజలను ఉద్దరించే ఏకైక లక్ష్యంతో పని చేసే యువతను గుర్తించి పని చేయాలి.. త్యాగం, ఉత్సాహాలతో వారిని జాగృతం చేసి ఐక్యం చేయాలి.. మన స్థితికి మనమే బాధ్యులం.. లక్ష్యాన్ని సాధించే శక్తి, ఆపై శక్తి మనకే ఉంది..’