Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోరూరించే గోంగూర మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం..

Webdunia
శనివారం, 18 జులై 2020 (14:51 IST)
Biryani
గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌లాంటి భయంకర వ్యాధులను కూడా నివారించడానికి గోంగూర ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. అలాగే మటన్‌లో ప్రోటీన్లు పుష్కలంగా వుంటాయి. ఈ రెండింటి కాంబోలో గోంగూర మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు :
బియ్యం - కేజీ
మటన్ - కేజీ
గోంగూర తరుగు - నాలుగు కప్పులు 
పెరుగు - 2 కప్పులు
పచ్చిమిర్చి - ఏడు 
నెయ్యి - 1 కప్పు
దాల్చిన చెక్క- 2 చిన్న ముక్కలు
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 3 టేబుల్ స్పూన్స్
లవంగాలు - 4
యాలకులు - 4
కారం - 2 టేబుల్ స్పూన్స్
పుదీనా తరుగు - 4 కప్పులు 
ఉల్లిపాయ తరుగు - మూడు కప్పులు
ఉప్పు - తగినంత
 
తయారీ విధానం: 
ముందుగా బాస్మతి బియ్యం కడిగి అరగంట నానబెట్టాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడైన తరువాత లవంగాలు, సాజీరా, యాలకులు, దాల్చిన చెక్క నిలువుగా తరిగిన మిర్చి, ఉల్లి ముక్కల్ని వేసి దోరగా వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా వేసి రెండు నిమిషాల తరువాత గోంగూర వేయాలి. తర్వాత పెరుగు, చికెన్, కారం, ఉప్పు వరుసగా వేసి సన్నటి సెగపై ఉడికించాలి.
 
మరో గిన్నెలో నీటిని మరిగించి అందులో నానబెట్టిన బియ్యం వేయాలి. అన్నం సగం ఉడికిన తరువాత దాన్ని వార్చి చికెన్ ఉడుకుతున్న గిన్నెలోకి వేయాలి. ఆవిరి పోకుండా ఉండేలా నిండుగా మూతపెట్టి, ఆ తర్వాత సన్నటి సెగపై 20 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతే వేడి వేడి గోంగూర మటన్బిర్యానీ రెడీ అయినట్లే. ఈ గోంగూర మటన్ బిర్యానీకి.. ఉల్లి పెరుగు లేదంటే.. చికెన్ 65 సైడిష్‌‍తో టేస్ట్ చేస్తే రుచి అదిరిపోతుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments