Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణలో కరోనాకు చెక్.. అదనంగా రూ.100 కోట్లు కేటాయింపు: కేసీఆర్

Advertiesment
తెలంగాణలో కరోనాకు చెక్.. అదనంగా రూ.100 కోట్లు కేటాయింపు: కేసీఆర్
, శనివారం, 18 జులై 2020 (10:42 IST)
తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, మెరుగైన వైద్యం అందించే విషయంలో అత్యవసర పనులు నిర్వహించుకోవడానికి వీలుగా జనరల్ బడ్జెట్‌కు అదనంగా రూ.100 కోట్లు కేటాయించారు సీఎం కేసీఆర్. ఆరోగ్య మంత్రి, సిఎస్ తక్షణ నిర్ణయాలు తీసుకుని అమలు చేయడానికి వీలుగా ఈ నిధులను అందుబాటులో ఉంచనున్నారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి నివారణకు, కరోనా సోకిన వారికి మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వం సర్వసిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. 
 
వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యుజిసి స్కేల్ అమలు చేయాలని నిర్ణయించారు. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాత వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించారు. ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచాలని నిర్ణయించారు.
 
కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్ర ప్రభుత్వమే మొదట గందరగోళంలో ఉండేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కావాల్సినవన్నీ చాలా వేగంగా సమకూర్చుకున్నామని... ఇప్పుడు వేటికీ కొరతలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని గాంధీ, టిమ్స్‌లోనే దాదాపు 3 వేల బెడ్లు ఆక్సిజన్ సౌకర్యంతో సిద్ధంగా ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం కలిగిన 5 వేల బెడ్లను సిద్ధం చేశామని అన్నారు. అన్ని ఆసుపత్రుల్లో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 10 వేల బెడ్లను కేవలం కరోనా కోసమే ప్రత్యేకంగా కేటాయించిపెట్టామని వివరించారు. అవగాహన లేకుండా ఎవరో చేసే చిల్లర మల్లర విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు.
 
కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పలు సూచనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.  1500 వెంటిలేటర్లు సిద్దంగా ఉన్నాయని.. లక్షల సంఖ్యలో పిపిఇ కిట్లు, ఎన్ 95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరంగల్ జిల్లాలో కరోనా విజృంభణ.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి