Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పకోడీలు తయారీ విధానం...

వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. ఇంకా గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింతే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్న

Webdunia
సోమవారం, 18 జూన్ 2018 (14:20 IST)
వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే దాంతో డ‌యాబెటిస్ దూరం అవుతుంది. గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింటే బాగా తెలివైన పిల్లలు పుడతారని, కంటిచూపును కూడా మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాంటి చేపలతో కూర, ఫ్రైలు కాకుండా పకోడీలు ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
చేప ముక్కలు - 2 కప్పులు
కోడిగుడ్లు -  3
కార్న్‌ఫ్లోర్ - 3 స్పూన్స్
కారం -  2 స్పూన్స్
కొత్తిమీర - 1 కప్పు
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత
నిమ్మరసం - 2 స్పూన్స్
 
తయారు చేసే విధానం :
ముందుగా కోడిగుడ్లను గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలపాలి. ఆ మిశ్రమంలో శుభ్రం చేసి ఉంచిన చేప ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. చేప ముక్కలకు మసాలా బాగా అంటేలా చేసుకోవాలి. అర్థగంట పాటు ఈ మిశ్రమాన్ని పక్కనబెట్టేయాలి. ఆపై స్టౌ మీద బాణలిని పెట్టుకుని నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దోరగా వేపుకోవాలి. అంతే... వేడి వేడి చేపల పకోడీలు రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

తర్వాతి కథనం
Show comments