Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రోడ్లపై పానీ పూరీ ఎందుకు? ఇంట్లోనే తయారు చేసుకుంటే...

రోడ్లపై పానీ పూరీ తిని అనారోగ్యంతో బాధపడేవారికి ఇంట్లోనే పానీ పూరీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.

Advertiesment
pani puri
రోడ్లపై పానీ పూరీ తిని అనారోగ్యంతో బాధపడేవారికి ఇంట్లోనే పానీ పూరీ ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ - అరకప్పు
మైదాపిండి - 1 స్పూన్
ఉప్పు - సరిపడా
నీళ్లు - సరిపడా
ఉడికించిన బంగాళాదుంపలు - 4
పచ్చిబఠాణీలు - కొద్దిగా
ఉల్లిపాయలు - 2 కప్పులు
కారం - సరిపడా
చాట్ మసాలా - కొద్దిగా
 
తయారీ విధానం:
పూరీ: ముందుగా గిన్నెలో బొంబాయి రవ్వను వేసుకుని అందులో మైదాపిండి, ఉప్పు బాగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా కొద్దిగా నీటిని పోసి కలుపుకుంటూ 15 నిమిషాల పాటు ఆ ముద్దను తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. ఇలా చేయడం వలన రవ్వ నీటిని పీల్చుకుని పిండి మృదువుగా మారుతుంది. ఇప్పుడు ఆ పిండిని ఉండలుగా చేసి చపాతీలా రుద్ది దానిలో ఏదైనా మూతతో చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇక పెనంలో నూనెను వేసి కాగిన తరువాత వాటిని బంగారురంగు వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
 
స్టఫింగ్ కోసం: గిన్నెలో బాగా ఉడకించి పొట్టు తీసిన బంగాళాదుంప, ఉడికించిన పచ్చిబఠాణీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కాస్త కారం పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మిశ్రమంగా కలుపుకుని ఉంచుకోవాలి.
 
పానీ: గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, అల్లం, పచ్చిమిర్చి వీటిని మిక్సీలో వేసి కొంత నీటిని కలిపి ద్రవం లాగా చేసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిన్న పిల్లలు కంటి జబ్బులతో బాధపడుతున్నారా...