Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాల సర్పదోష మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు.. 57 అడుగుల ఎత్తు..

సప్త ముఖాలతో కాల సర్పదోష నివారకుడిగా హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది దర్శనమివ్వనున్నాడు. ఈ గణపతిని 57 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో రూపొందించనున్నారు. ఈ మేరకు గత నెల 25న కర్రపూజకు అంకురార్పణ జరి

Advertiesment
కాల సర్పదోష మహాగణపతిగా ఖైరతాబాద్ వినాయకుడు.. 57 అడుగుల ఎత్తు..
, సోమవారం, 18 జూన్ 2018 (12:31 IST)
సప్త ముఖాలతో కాల సర్పదోష నివారకుడిగా హైదరాబాద్ ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది దర్శనమివ్వనున్నాడు. ఈ గణపతిని 57 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పుతో రూపొందించనున్నారు. ఈ మేరకు గత నెల 25న కర్రపూజకు అంకురార్పణ జరిగింది.


ఈ వినాయకుడు ఈ ఏడాది సెప్టెంబర్ 13న వినాయక చతుర్థి పండుగకు వారం రోజుల ముందు సిద్ధమవుతుందని.. శిల్పి రాజేంద్రన్ చెప్పారు. ఈ నేపథ్యంలో జూన్-17 (ఆదివారం) రాత్రి శ్రీ సప్తముఖ కాల సర్ప మహాగణపతి రూపం మోడల్‌ను ఆవిష్కరించారు. 
 
ఈ మోడల్‌లో ఖైరతాబాద్ గణపతి.. శాంత చిత్తంతో ఉన్న ఏడు గణపతి ముఖాలు, 14 చేతులు అందులో కుడి వైపు ఆంకుశం, చక్రం, కత్తి, సర్పం, బాణం, గధతో కూడి ఆశీర్వదిస్తుండగా, ఎడమ వైపు పాశం, శంకు, కమలం, ఢమరుకం, విల్లూ, కడియం, లడ్డూ ఉంటాయి. 57 అడుగుల గణపతికి మరో మూడు అడుగుల ఎత్తులో ఏడు తలల శేషుడు తన పడగతో నీడ కల్పిస్తాడు.
 
వెనుక వైపు ఆరు ఏనుగులు ఐరావత రూపంలో స్వామి వారిని కొలుస్తున్నట్లు కనిపిస్తాయి. గత ఆనవాయితిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా రెండు వైపులా చిరు మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. గణేశుడికి కింద నుంచి కుడి వైపున 14 అడుగుల ఎత్తులో లక్ష్మీదేవి, ఎడమ వైపున చదువుల తల్లి సరస్వతి అమ్మవార్లు ఆసీనులై ఉంటారు. పాదల దగ్గర ఆయన వాహనం ఎలుక స్వామి వారికి భజన చేస్తూ కనిపిస్తుంది.
 
గణేశుడికి మరో కుడివైపు ఈ ఏడాది కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ శ్రీనివాసుడి కల్యాణ దర్శన భాగ్యం కలిగిస్తున్నారు. మరో ఎడమ వైపు 14 అడుగుల ఎత్తులో తలపై గంగతో నందీశ్వరునిపై ఆశీనులైన కుమారస్వామి సహిత శివపార్వతులు దర్శనమిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొమ్మ తుపాకీ తల్లి ప్రాణాలు తీసింది.. పార్కులో దొరికిందని కూతురికిస్తే?