కాకరకాయ కూర తయారీ విధానం...
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరలో ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి. కాకరకాయను తీసుకుంటే రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేసుకోవచ్చు. రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చును. ఇటువంటి కాకరక
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కాకరలో ఎన్నో రోగాలను నయం చేసే ఆయుర్వేద గుణాలున్నాయి. కాకరకాయను తీసుకుంటే రక్తపోటు, హైబీపీ, అలర్జీలను దూరం చేసుకోవచ్చు. రక్త సంబంధిత రోగాలకు చెక్ పెట్టవచ్చును. ఇటువంటి కాకరకాయతో ఒక మంచి వంటకాన్ని తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
కాకరకాయలు - అరకేజీ
ఉప్పు - సరిపడా
ఉల్లిపాయలు - రెండు
కారం - సరిపడా
పచ్చిమిర్చి - 3
పసుపు - 1/2 స్పూన్స్
నూనె - సరిపడా
తయారీ విధానం :
కాకరకాయలకు పైపొట్టు తీసివేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తరువాత వాటిల్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికిన తరువాత అందులోని నీటిని వంపేసి ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దను ఉడికించిన కాకరకాయలలో వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనెను వేసి కాగాక కాకరకాయ ముక్కల్ని వేసి బాగా వేయించి కారంచల్లి మరి కాసేపు ఉంచి దించేయాలి. అంతే కాకరకాయ కూర రెడీ.