Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి ఉపవాస వేళ మీరు తీసుకోవాల్సిన మూడు ఆహార పదార్ధాలు

Webdunia
సోమవారం, 11 అక్టోబరు 2021 (20:47 IST)
దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అన్ని ముఖ్యమైన హిందూ పండుగలైనటువంటి  దసరా, కర్వా చైత్‌ మరియు దీపావళికి  ఆరంభంగా నవరాత్రిని చూస్తుంటారు. తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుక నవరాత్రి. దుర్గా మాత పట్ల తమ  అచంచలమైన భక్తిని వెల్లడించడంలో ఎలాంటి లోపాలు లేకుండా తమ వంతు ప్రయత్నాలను చేస్తుంటారు భక్తులు. ఆ క్రమంలోనే కొంతమంది కొన్ని రోజులు లేదంటే నవరాత్రిలో తొమ్మిది రోజులూ ఉపవాసం ఆచరిస్తూ దుర్గామాత ఆశీస్సులు పొందాలనుకుంటారు.
 
అందువల్ల, ఈ అత్యంత శుభప్రదమైన నవరాత్రి వేళ మీరు ఉపవాసం ఉండాలనుకుంటున్నారా? అయితే, ఈ తొమ్మిది రోజుల పండుగల వేళ ఉపవాసం ఆచరిస్తున్నప్పటికీ మిమ్మల్ని మీరు శక్తివంతంగా మలుచుకునేందుకు మీరు ఏం తినాలనేది ఎప్పుడూ ప్రశ్నగానే నిలుస్తుంటుంది. మీరు సరైన రీతిలో ఆహారం తీసుకుంటే ఈ నవరాత్రి డైట్‌ అత్యంత ఆరోగ్యవంతమైన డైట్‌గా నిలిచే అవకాశాలూ ఉన్నాయి.  ఈ నవరాత్రి వేళ, మీ శరీరం తగినంతగా పోషకాలను అందుకుంటుందన్న భరోసాను ఈ మూడు ఆహారాలతో పొందండి. నిజానికి ఉపవాస వేళ వీటిని తినవచ్చని మీకు తెలియకపోవచ్చు.
 
1. క్వినోవా.. మీకు తెలుసా, క్వినోవా అనేది ఓ స్యూడో సెరల్‌ మరియు అమరాంత్‌ (తోటకూర) కుటుంబంలో భాగమని! క్వినోవా విత్తనమే కానీ, గింజ కాదు. బియ్యంకు ప్రత్యామ్నాయంగా ఇది పని చేస్తుంది. నవరాత్రి ఉపవాస వేళ అధిక ప్రొటీన్‌, ఫైబర్‌, పలు రకాల విటమిన్స్‌, మినరల్స్‌ కలిగిన ఈ ఆహారం తీసుకోవచ్చు. ఇది అత్యున్నత పోషకాలతో కలిగి ఉంది మరియు తక్షణ శక్తి పరిష్కారాలనూ అందిస్తుంది.
 
2. చిలకడదుంప.. ఉపవాస వేళ, మీరు తియ్యటి రుచులను ఆస్వాదించాలనుకుంటే, ఖచ్చితంగా మీరు చిలకడదుంపను మీ మెనూలో జొడించుకోవాల్సిందే! శరీరంలో డీ హైడ్రేషన్‌ తొలగించే శక్తి చిలకడదుంపకు ఉంది. దీనిలో పొటాషియం, సోడియం,కాల్షియం లాంటి మూలకాలు ఉన్నాయి. శరీరానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ ఇది తోడ్పడుతుంది.
 
3. బాదములు.. నవరాత్రి వేడుకల వేళ తినేందుకు అనువుగా ఉండే మరో స్నాక్‌ బాదములు. దీనియొక్క సూక్ష్మమైన, వెన్నలాంటి రుచి, వైవిధ్యత కారణంగా, వీటిని అతి సులభంగా నేరుగా తినవచ్చు లేదా గింజలు, విత్తనాలతో కలిపి కూడా తినవచ్చు. వీటితో పాటుగా పోషకాలు అత్యధికంగా కలిగిన బాదములు ఎలాంటి స్నాకింగ్‌కు అయినా అత్యంత అనువుగా ఉంటాయి. అది భోజనాల నడుమ తీసుకునే స్నాక్‌ లేదా బింగీ వాచింగ్‌, అర్ధరాత్రి పూట తినడ లేదా వర్కవుట్‌కు ముందు లేదా వెనుక అయినా దీనిని తీసుకోవచ్చు. శరీరానికి అవసరమైన శక్తిని బాదములు అందిస్తాయని తెలిసిందే! పండుగ సమయాలలో మరీ ముఖ్యంగా ఉపవాసం వేళ ఇది తగిన శక్తిని అందిస్తుంది. అంతేకాదు, బాదములకు ఆకలి తీర్చే గుణాలు కూడా ఉన్నాయి. అందువల్ల భోజనాల నడుమ వీటిని తీసుకుంటే కడుపు నిండిందన్న భావన కలిగిస్తుంది.
 
 
చివరగా,  ఓ గుప్పెడు బాదములను నవరాత్రి ఉపవాస వేళ తీసుకుంటే చర్మ సౌందర్య పరంగా అద్భుతాలను ఇది చేస్తుంది. ఎందుకంటే, బాదములలో ఆరోగ్యవంతమైన  కొవ్వు, విటమిన్‌ ఈ (ఆల్ఫా టోకోఫెరాల్‌) వంటివి ఉన్నాయి. ఇది అతి కీలకమైన  యాంటీ ఏజింగ్‌ లక్షణాలు కలిగి ఉంది. ఇది చర్మ ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనం కలిగిస్తుంది.
 
- రితికా సమద్దార్‌, రీజనల్‌ హెడ్‌- డైటిటిక్స్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌-ఢిల్లీ

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: జనవరి 2, 2025న పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు ప్రారంభం

వృద్ధ మహిళపై వీధికుక్కల గుంపు దాడి.. చివరికి ఏమైందంటే? (video)

ఉత్తరాఖండ్‌- 1,500 అడుగుల లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి (video)

Venu Swamy: అల్లు అర్జున్‌కు మార్చి 29 వరకు టైమ్ బాగోలేదు (video)

Jani Master: శ్రీతేజను పరామర్శించిన జానీ మాస్టర్.. ఇంత వరకే మాట్లాడగలను (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

22-12-2024 ఆదివారం దినఫలితాలు - రుణ సమస్యలు తొలగిపోతాయి..

Weekly Horoscope: 22-12-2024 నుంచి 28-12-2024 వరకు ఫలితాలు- మీ మాటలు చేరవేసే వ్యక్తులు?

21-12-2024 శనివారం దినఫలితాలు : ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి...

తిరుమల కోసం స్వర్ణ ఆంధ్ర విజన్-2047: టీటీడీ ప్రారంభం

19-12-2024 గురువారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు దూరంగా ఉండండి..

తర్వాతి కథనం
Show comments