Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతున్న కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి

Webdunia
బుధవారం, 14 జులై 2021 (22:17 IST)
తిరువనంతపురం: కరోనా వైరస్‌ విజృంభణతో వణికిపోతున్న కేరళలో జికా వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 73 ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన జికా కేసుల సంఖ్య 19కి చేరింది.
 
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు జికా వైరస్‌ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె నమూనాలను కోయంబత్తూర్‌లోని ల్యాబ్‌కు పంపించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. వీటితో పాటు మరో ఐదు నమూనాలను అలప్పుజాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీకి పంపించగా అవన్నీ నెగటివ్‌ వచ్చినట్లు తెలిపారు.
 
రాష్ట్రంలో జికా కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్టా అక్కడి ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. దీంతో వీటి నిర్ధారణకు ఉపయోగించే 2100 టెస్ట్‌ కిట్లను రాష్ట్రవ్యాప్తంగా నాలుగు మెడికల్‌ కాలేజీలలో అందుబాటులో ఉంచింది. కేవలం ఆదివారం జరిపిన పరీక్షల్లోనే ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 46 ఏళ్ల వ్యక్తి, 29 ఏళ్ల హెల్త్‌ వర్కర్‌తోపాటు 22 నెలల వయసున్న చిన్నారి ఉన్నారు. ప్రస్తుతం వారందరినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments