Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిపీటలపై వధూవరులు.. వధువు మెడలో పూలమాల వేసిన యువకుడు... తర్వాత?

పెళ్లిపీటలపై వధూవరులు కూర్చొనివున్నారు. వధువు మెడలో మరికొన్ని క్షణాల్లో మూడుముళ్లు వేయాల్సివుంది. ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన ఓ యువకుడు ఉన్నట్టుండి వధువు మెడలో ఓ పూలమాల వేశాడు.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (12:05 IST)
పెళ్లిపీటలపై వధూవరులు కూర్చొనివున్నారు. వధువు మెడలో మరికొన్ని క్షణాల్లో మూడుముళ్లు వేయాల్సివుంది. ఇంతలో ఎక్కడ నుంచో వచ్చిన ఓ యువకుడు ఉన్నట్టుండి వధువు మెడలో ఓ పూలమాల వేశాడు. అంతే.. అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. పైగా, పెళ్లిపీటలపై ఉన్న వరుడు కూడా ఒకింతి షాక్‌కు గురై, నిశ్చేష్టుడైపోపాయాడు. ఇంతలో వధువు కూడా పెళ్లిపీటలపై నుంచి లేచివచ్చి మరో మాలను యువకుడి మెడలో వేసింది. ఆ తర్వాత వధువు బంధువులంతా కలిసి ఆ యువకుడిని చితకబాదగా, జరిగిన ఘటనతో షాక్‌తిన్న వరుడు కుటుంబ సభ్యులు మండపం నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నగీనా జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నగీనా జిల్లాలో యువతీయువకుడికి పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. ఈ పెళ్లి తతంగం అంతా ఓ మండపంలో నిర్వహించసాగారు. ఇంతలో 24 ఏళ్ల రాహుల్ అనే యువకుడు పెళ్లి జరుగుతున్న వేడుక దగ్గరకు బైక్ మీద వచ్చాడు. ఆ తర్వాత స్టేజ్‌‌కు కొంచం దూరంలో నిలబడి, తన చేతిలో ఉన్న పూలమాలను తీసి వధువు వైపు విసిరాడు. 
 
ఆ మాల నేరుగా వెళ్లి పెళ్లి కుమార్తె మెడలో పడింది. దీంతో అక్కడున్న బంధుమిత్రులంతా ఒక్కసారి అవాక్కయ్యారు. పెళ్లి కూతురు కూడా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి తన మెడలో ఉన్న పూలమాలను అతని మెడలో వేసింది. ఆ షాక్ నుంచి కోలుకునేందుకు అతిథులకు టైం పట్టింది. 
 
అయితే వధువు తరపున బంధువులు వచ్చి ఆ అబ్బాయిని చితకబాదారు. వరుడు తరపున బంధువులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఇక పోలీసులు వచ్చి ఆ అబ్బాయిని అరెస్టు చేశారు. అమ్మాయి దళితురాలు కాగా, అబ్బాయి ఉన్నత కులానికి చెందినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments