Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిగుడ్డును చిదిమేశారు : ఆరు నెలల చిన్నారిని రేప్ చేసి హత్య

దేశంలో బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులకు కూడా రక్షణ కరువైంది. వీరిపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ క్రూర అకృత్యాలు హృదయాలను పిండేస్తున్నాయి.

Webdunia
శనివారం, 21 ఏప్రియల్ 2018 (11:33 IST)
దేశంలో బాలికలు, చిన్నారులు, చివరికి పసిగుడ్డులకు కూడా రక్షణ కరువైంది. వీరిపై వరుసగా జరుగుతున్న అఘాయిత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ముఖ్యంగా ఈ క్రూర అకృత్యాలు హృదయాలను పిండేస్తున్నాయి. దేశంలో ఏదో ఒక మూల చోటు చేసుకున్న అఘాయిత్యాల తీరు, హత్యలు ప్రతీ మనిషినీ ఆందోళనకి గురిచేస్తున్నాయి.
 
ఇటీవల కథువా, ఉన్నావ్‌, సూరత్‌, చత్తీస్‌ఘడ్‌.. ఇలా పలు ప్రాంతాల్లో అభంశుభం తెలియని చిన్నారులు అత్యాచారానికి గురయ్యారు. ఇపుడు మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఓ పసికందు కామాంధుడి అకృత్యానికి మౌన సాక్ష్యంగా మిగిలింది. 
 
ఆరు నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డాడో మానవ మృగం. ఈనెల 20వ తేదీన శుక్రవారం మధ్యాహ్నం ఓ కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్‌‌లో రక‍్తపు మడుగులో ఆరు నెలల శిశువు మృతదేహం పడి ఉంది. సీసీ టీవీ ఫుటేజ్‌ పరిశీలించగా.. నిందితుడిని సునీల్‌  భీల్(‌21)గా గుర్తించారు. 
 
పాప శరీరంలోని ప్రైవేట్ భాగాల్లోనూ, తలపైన గాయాలను గుర్తించినట్టు చెప్పారు. బాధితురాలు తల్లిదండ్రులు రాజ్వాడాలో బెలూన్లు అమ్ముకుని జీవిస్తారని, నిందితుడు కుటుంబానికి పరిచయస్తుడేనని పోలీసు అధికారి మిశ్రా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

Vadde naveen: ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు గా వడ్డే నవీన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments