Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంతూరికి వచ్చిన యువకుడు.. చంపేసిన ప్రియురాలి తండ్రి

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (14:41 IST)
లాక్ డౌన్ కారణంగా సొంతూరుకు వచ్చిన కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి సొంతూరులో వుంది. కానీ ఆమెను వేరు చేయడమే కాకుండా కరోనా లాక్ డౌన్‌తో సొంతూరికి వచ్చిన యువకుడిని ప్రియురాలి తండ్రి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తమిళనాడులోని మొరప్పన్‌తంగల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. 
 
మొరప్పన్‌తంగల్‌ గ్రామానికి చెందిన సుధాకర్‌ అనే యువకుడు వృత్తిరీత్యా భవన నిర్మాణ రంగంలో కూలీ. ఈ యువకుడికి ఒందికుడిసాయి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆరు నెలల తర్వాత వీరిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటూ.. ఓ అద్దె గదిలో నవ దంపతులు ఉంటున్నారు. 
 
మొత్తానికి వీరు నివాసముంటున్న అడ్రస్‌ తెలుసుకుని సొంత గ్రామానికి తీసుకువచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు. స్థానిక పెద్దలతో పంచాయతీ పెట్టి.. వీరిద్దరిని వేరు చేశారు. దీంతో తనను చంపుతారేమో అనే భయంతో సుధాకర్‌ తన గ్రామం నుంచి చెన్నైకి వెళ్లిపోయాడు. కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌  విధించిన సంగతి తెలిసిందే. దీంతో సుధాకర్‌ ఇటీవలే తన సొంతూరుకు వచ్చాడు.
 
సుధాకర్‌ సొంతూరకు వచ్చినట్లు ప్రియురాలి తండ్రికి తెలిసింది. దీంతో ఆ గ్రామానికి చేరుకుని సుధాకర్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులు మూర్తి(45), కతిరవణ్‌(25)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అజిత్ కుమార్ పట్టుదలకు యు/ఎ సెన్సార్

అప్సరా రాణి రాచరికం మూవీ ఎలా ఉందంటే.. రాచరికం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments