Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేంజర్ మార్క్‌ దాటిన యమునా నది : వరద ముప్పు ముంగిట ఢిల్లీ

Webdunia
శుక్రవారం, 30 జులై 2021 (18:48 IST)
యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఢిల్లీతో పాటు.. దాని ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు హతినికుండ్ ప్రాజెక్టు నుంచి వరద నీటికి ఒక్కసారిగా భారీగా విడుదల చేశారు. దీంతో యమునా నది ప్రమాద హెచ్చరికలను దాటి ప్రవహిస్తుంది. ఈ కారణంగా దేశ రాజధాని ఢిల్లీ పరిసరాలకు వరద ముప్పు పొంచి ఉంది. 
 
ప్రస్తుతం ఢిల్లీ వద్ద యమున నది నీటి మట్టం 205.33 మీటర్లు దాటింది. దాంతో ఢిల్లీ అధికార యంత్రాంగం వరద హెచ్చరిక జారీ చేసింది. యుమున నదీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
యమున నది నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడంతో అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలకు బోట్లను అధికారులు అందుబాటులో ఉంచారు. అలాగే, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అంగరంగ వైభవంగా నటుడు నెపోలియన్ కుమారుడు వివాహం

కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కు దక్కిన ఫలితమే క విజయం

పాన్ ఇండియా చిత్రాలకు ఆ తమిళ హీరోనే స్ఫూర్తి : ఎస్ఎస్.రాజమౌళి

రెబల్ స్టార్ ప్రభాస్ తో మూడు మెగా సినిమాలు ప్రకటించిన హోంబలే ఫిల్మ్స్

'అమ్మ'కు ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేయను : మోహన్ లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments