Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆగష్టులో బ్యాంకు సెలవులు : ఖాతాదారులకు అలెర్ట్

Advertiesment
ఆగష్టులో బ్యాంకు సెలవులు : ఖాతాదారులకు అలెర్ట్
, శుక్రవారం, 30 జులై 2021 (17:51 IST)
మీరు వ‌చ్చే నెల‌లో మీ ఖాతా ఉన్న బ్యాంక్ శాఖ‌ను సంద‌ర్శించాల‌ని భావిస్తున్నారా..? అయితే.. ఆగ‌స్టులో 15 రోజుల పాటు సెల‌వుల వ‌ల్ల బ్యాంకులు ఆయా రోజుల్లో ప‌ని చేయ‌వు. క‌నుక మీరు మీ బ్యాంక్ శాఖ‌ను సంద‌ర్శించ‌డానికి బ‌య‌లుదేరే ముందు ఒక‌సారి ముఖ్య‌మైన బ్యాంక్ హాలీడేస్ జాబితాను చెక్ చేసుకుంటే స‌రి..
 
బ్యాంకు ఉద్యోగుల‌కు ఇచ్చే సెల‌వుల‌ను రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మూడు క్యాట‌గిరీలుగా విడ‌దీసింది. హాలీడే అండ‌ర్ నెగోషియ‌బుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌, రియ‌ల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే , బ్యాంక్స్ క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ పేరిట విభ‌జించింది.
 
ఆగ‌స్టులో వ‌చ్చే ప‌లు ప‌ర్వ‌దినాలు.. నెగోషియ‌బుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ ప‌రిధిలోకి వ‌స్తున్నాయి. దీంతో ఆయా పండుగ‌ల‌కు సెల‌వులు వ‌చ్చేశాయి. అదే స‌మ‌యంలో ప‌లు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకింగ్ కంపెనీలు బ్యాంక్ హాలీడేలు పాటించ‌డం లేదు. ఆయా రాష్ట్రాల్లో పండుగ‌లు, లేదా ప్ర‌భుత్వాల నోటిఫికేష‌న్ల‌ను బ‌ట్టి బ్యాంకులకు సెల‌వులు ఇస్తారు.
 
ఆదివారంతోనే ఆగ‌స్టు నెల మొద‌ల‌వుతుంది. క‌నుక ఒక‌టో తేదీన బ్యాంకులు మూసి ఉంటాయి. దీంతోపాటు రెండో శ‌నివారం, నాలుగో శ‌నివారం, ఆదివారాల‌తో క‌లిపి మొత్తం ఎనిమిది సెల‌వులు వ‌స్తాయి. ఆగ‌స్టు 15 కూడా ఆదివారం.. స్వాతంత్ర్య దినోత్స‌వం..
 
పార్శీ నూత‌న సంవ‌త్స‌రాది సంద‌ర్భంగా ఆగ‌స్టు 16న బెలాపూర్‌, ముంబై, నాగ్‌పూర్ వాసులు సంబురాలు చేసుకుంటారు. 19న మొహ‌రం సంద‌ర్భంగా అగ‌ర్త‌ల‌, అహ్మ‌దాబాద్‌, బెలాపూర్‌, భోపాల్‌, హైద‌రాబాద్‌, జైపూర్‌, కాన్పూర్‌, జ‌మ్ము, కోల్‌క‌తా, ల‌క్నో, ముంబై, నాగ్‌పూర్‌, న్యూఢిల్లీ, పాట్నా, రాయ్‌పూర్‌, రాంచీ, శ్రీ‌న‌గ‌ర్‌ల‌లో బ్యాంకులు ప‌నిచేయ‌వు.
 
ఆగ‌స్టులో సెల‌వులు ఇవే..:
 
ఆగస్టు 1- ఆదివారం
ఆగస్టు 8- ఆదివారం
ఆగస్టు 13- దేశ‌భ‌క్తుల దినోత్స‌వం
ఆగ‌స్టు 14- రెండో శ‌నివారం
ఆగ‌స్టు 15- స్వాతంత్ర్య దినోత్స‌వం, ఆదివారం
ఆగ‌స్టు 16- పార్శీ నూత‌న సంవ‌త్స‌రాది
ఆగ‌స్టు 19- మొహ‌ర్రం
ఆగ‌స్టు 20-మొహ‌ర్రం/ఫ‌స్ట్ ఓనం
ఆగ‌స్టు 21- తిరువోనం
ఆగ‌స్టు 22- ఆదివారం
ఆగ‌స్టు 23- శ్రీ నారాయ‌ణ గురు జ‌యంతి
ఆగ‌స్టు 28- నాలుగో శ‌నివారం
ఆగ‌స్టు 29- ఆదివారం
ఆగ‌స్టు 30- జ‌న్మాష్ట‌మి
ఆగ‌స్టు 31: శ్రీ కృష్ణాష్ట‌మి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మింకపల్లిలో నక్సల్స్ స్మారక స్తూపం కూల్చివేత