లక్నోలో రేప్.. నాగ్‌పూర్‌లో ఫిర్యాదు... ఫ్రెండ్ చేతిలో మోసపోయిన నేపాలీ మహిళ!

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2020 (11:05 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ దేశానికి చెందిన ఓ మహిళ మోసపోయింది. ఓ టెక్కీతో సహా నలుగురు కామాంధుల చేతిలో అత్యాచారానికి గురైంది. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సాహసం చేయలేకపోయింది. తనకు ఆశ్రయం కల్పించిన మహిళా స్నేహితురాలే కామాంధులతో చేతులు కలిపి మోసం చేసింది. దీంతో 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహారాష్ట్రంలోని నాగ్‌పూర్‌లో ఫిర్యాదు చేసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నేపాల్‌కు చెందిన 22 యేళ్ళ మహిళ 2018లో లక్నోలో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వచ్చింది. ఆమె ప్రవీణ్‌ రాజ్‌పాల్‌ యాదవ్‌ అనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను నేపాల్ మహిళకు పరిచయం చేసింది. వీరిద్దరూ కొంతకాలం పాటు సన్నిహితంగా మెలిగారు. ఆ తర్వాత ప్రవీణ్ తన స్నేహితులతో కలిసి ఆ మహిళకు మత్తుమందు తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ విషయం పోలీసులకు చెబితే నగ్నంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తామని బెదిరించారు. స్నేహితురాలికి చెప్పినా పట్టించుకోలేదు. ఇక చేసేది లేక తనకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బాధితురాలు చేరుకుంది. కేసు నమోదుచేసిన పోలీసులు ఆమెను బందోబస్తు నడుమ లక్నోకు తీసుకుని బయలుదేరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

Rajiv: లవ్ ఓటీపీ..లో కొడుకుని కూతురిలా చూసుకునే ఫాదర్ గా రాజీవ్ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments