Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నుంచి కాపాడు స్వామీ.. 14 కిలోమీటర్లు మహిళ పొర్లు దండాలు

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (13:30 IST)
Thiruvannamalai
పంచభూత క్షేత్రాల్లో ఒకటైన తిరువణ్ణామలైలో గిరి ప్రదక్షిణకు వేలాదిమంది భక్తులు తరలివస్తారు. తిరువణ్ణామలై గిరిప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఏ పుణ్యక్షేత్రంలోనైనా భక్తులు కేవలం దేవాలయం చుట్టూ మాత్రమే ప్రదక్షిణలు చేస్తారు. లేదా పొర్లుదండాలు పెడతారు. కానీ తిరుమణ్ణామలై అంటే అంటే ఓ కొండ. ఆ కొండ కోవెల. స్వామి అగ్నిలింగంగా వెలసిన పుణ్యక్షేత్రం తిరుమణ్ణామలై.
 
తిరువణ్ణామలై చుట్టూ మొత్తం గిరిప్రదక్షిణ 14 కిలోమీటర్లను ఓ భక్తురాలు పొర్లు దండాలు పెట్టి ''స్వామీ ఈ కరోనా మహమ్మారి నుంచి మానవాళిని కాపాడు స్వామీ'అంటూ వేడుకుంది. సదరు భక్తురాలు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడుకి చెందిన మాధవి.
 
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో మంగళవారం (జూన్ 22,2021) 14 కిలోమీటర్లు గిరివలయం రోడ్డుపై అంగప్రదక్షిణ చేసింది. అరుణాచలేశ్వరాలయంలో పౌర్ణమి రోజున భక్తులు గిరిప్రదక్షిణ (గిరివలయం) చేస్తుంటారు. ముఖ్యంగా చిత్ర పౌర్ణమి, కార్తీక దీపోత్సవ పౌర్ణమి రోజున వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి గిరిప్రదక్షిణలో పాల్గొంటారు.
 
అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుండి అనేక కోణాలనుంచి కనిపించే ఏకైక ముఖ్యశిఖరంతో అలరారే ఏకపర్వతం. పరిక్రమ లేక ప్రదక్షిణ అంటే అరుణాచలం చుట్టూ వున్న 14 కి.మీ.ల మార్గాన్ని సవ్యదిశలో పాదరక్షలు లేకుండా నడచి పూర్తిచెయ్యడం. అంటే, గిరి కుడివైపుకు వచ్చేలా చుట్టిరావడాన్ని గిరిప్రదక్షిణం అంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments