Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకృష్ణుని భగవానుని కోసం నర్మదా నదిలో దూకిన మహిళ

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (19:57 IST)
ఆ కాలంలో శ్రీకృష్ణుని కోసం వేలమంది గోపికలు పరితపించి పోయారని విన్నాం. అయితే ఈ కాలంలో కూడా అలాంటి వారు అడపాదడపా దర్శనమిస్తున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన స్వాతి గౌర్ (32) శ్రీకృష్ణుని కలుసుకునేందుకు తపించిపోయిన మీరాబాయిని స్ఫూర్తిగా తీసుకుని నర్మద నదిలో దూకింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్‌లోని మంగ్వారీ ప్రాంతానికి చెందిన స్వాతి వివాహితురాలు. ఎప్పుడూ శ్రీకృష్ణ నామ స్మరణలోనే ఉండేది. ఇటీవల ఆమె తన భర్త భూపేంద్రతో కలిసి బైక్‌పై షాహ్‌గంజ్ వెళుతుండగా బైక్ మీద కూర్చున్న ఆమె కృష్ణ భక్తిలో లీనమైంది. బైక్ నర్మద బ్రిడ్జి మీదకు చేరుకోగానే భర్తతో తన చెప్పు కింద పడిపోయిందని చెప్పగా భూపేంద్ర వెంటనే బైక్ ఆపాడు. తర్వాత కిందకు దిగిన స్వాతి గౌర్ నర్మదా నదిలోకి దూకేసింది. 
 
అయితే అదృష్టవశాత్తూ నదిలో నరేంద్ర కెవట్, ప్రశాంత్ కహార్ అనే ఇద్దరు జాలరులు ఉండటంతో ఆమెను ప్రాణాలతో రక్షించారు. పోలీసుల విచారణలో స్వాతి తాను శ్రీకృష్ణ భగవానుని కలుసుకునేందుకు నర్మదలో దూకినట్టు తెలిపింది. నర్మద నదిని చూడగానే తనకు శ్రీకృష్ణుని దర్శనం కలిగినట్లయ్యిందని పేర్కొంది. కాగా ఆ జాలరులు ఆమెను రక్షించి, బోటులో కూర్చోబెట్టిన సమయంలోనూ ఆమె శ్రీకృష్ణ జపం చేస్తూ వచ్చింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments