Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడితో ఉల్లాసం.. విషం రాసిన బిస్కెట్లను కన్నబిడ్డకు తినిపించింది..

Webdunia
మంగళవారం, 28 మే 2019 (18:01 IST)
తమిళనాడులోని కోవైలో అక్రమ సంబంధం ఓ చిన్నారి ప్రాణాన్ని బలిగొంది. ప్రియుడితో ఉల్లాసంగా గడిపేందుకు ఓ మహిళ కన్నబిడ్డనే దూరం చేసుకుంది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా వుందనే కోపంతో బిస్కెట్‍‌కు విషం రాసి కన్నబిడ్డను కడతేర్చింది.. ఓ కిరాతక తల్లి. స్వయంగా విషం రాసిన బిస్కెట్‌ను తన చేతులారా తినిపించి హతమార్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. కోవై జిల్లా, శరవణంపట్టికి సమీపంలో ఓ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంకా చిన్నారి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. ఇంతలో తన బిడ్డ కనిపించలేదని ఆ ప్రాంతానికి చెందిన రూబిని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
ఆపై పోలీసులు మృతి చెందిన చిన్నారి ఫోటోను ఆమెకు చూపెట్టి ఓ నిర్ధారణకు వచ్చారు. మృతురాలు పేరు దేవీ శ్రీ అని ఆమె తల్లిపేరు రూబిని తెలిసింది. మృతి చెందిన చిన్నారి తన బిడ్డేనని పోలీసుల ముందు రూబిని బోరున విలపించింది. అయితే రూబినీపై పోలీసులకు అనుమానం వచ్చింది. రూబిని వద్ద జరిపిన విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. 
 
తన ప్రియుడితో కలిసి దేవీశ్రీని చంపేసినట్లు రూబిని ఒప్పేసుకుంది. ఇంకా తన భర్త పాల్ రాజ్‌తో ఏర్పడిన విబేధాల కారణంగా అతడికి దూరంగా వున్నానని.. దేవీశ్రీ తన వద్దే పెరుగుతుందని తెలిపింది. ఇంతలో రూబినికి తమిళ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వీరి ఉల్లాసానికి రూబిని అడ్డుగా వుందని భావించారు. పక్కా ప్లాన్ ప్రకారం విషం రాసిన బిస్కెట్‌ను దేవీ శ్రీకి తినిపించింది రూబిని. 
 
బిస్కెట్లను ఆశగా తిన్న ఆ చిన్నారి కాసేపట్లోనే స్పృహ తప్పి పడిపోయింది. ఆపై దేవీశ్రీ మృతదేహాన్ని తమిళ్ కరట్టుమేడు ప్రాంతంలో పడేశాడు. అక్కడ నుంచి అలానే పారిపోయాడు. ఈ కేసుపై రూబినీని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో వున్న తమిళ్‌ను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments