Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడిగినంత కట్నం ఇవ్వలేదనీ.. కోడలికి చేతిగోళ్లు, జుట్టును కత్తిరించిన అత్తింటివారు

Webdunia
బుధవారం, 10 ఏప్రియల్ 2019 (09:20 IST)
వరకట్న వేధింపులకు అనేక మంది మహిళలు బలైపోతున్నారు. మరికొంతమంది మహిళలు చిత్ర హింసలకు గురవుతున్నారు. తాజాగా ఓ వివాహితను అత్తింటివారు పలురకాలుగా హింసకు గురిచేశారు. చేతిగోళ్లతో పాటు జట్టును కత్తిరించి, చావబాదారు. దీంతో ఆ మహిళ అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో ఆమెను తీసుకెళ్లి రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. ఈ దారుణ బీహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజ్ జిల్లాలో వెలుగు చూసింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ జిల్లాకు చెందిన 22 యేళ్ళ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.2 లక్షలతో పాటు బైక్‌ కూడా కొనివ్వాలని అత్తింటివారు డిమాండ్ చేశారు. ఇందుకు సరేనన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో వాళ్లు కట్నం ఇవ్వలేకపోయారు. ఇక అప్పటి నుంచి భర్తతో పాటు.. అత్తమామలు భార్యను వేధించసాగారు. 
 
ఈ క్రమంలో సోమవారం ఇనుప రాడ్లను వేడి చేసి బాధితురాలికి వాతలు పెట్టారు. చేతిగోళ్లను, జుట్టును పూర్తిగా కత్తిరించి దారుణంగా హింసించారు. అనంతరం ఆమెను సమీపంలోని ఓ రైల్వేట్రాక్‌పై పడేశారు. అయితే కాసేపటి తర్వాత మెలకువ రావడంతో బాధితురాలు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి చేరుకున్న ఆ మహిళ ప్రాధమిక చికిత్స అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు... భర్తతో పాటు.. అత్తమామలను కూడా అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments