Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా అత్త కిటికీ వద్ద నిలబడి నన్ను రేప్ చేయించింది... అతడికి చాక్లెట్ చాలంతే...

Advertiesment
నా అత్త కిటికీ వద్ద నిలబడి నన్ను రేప్ చేయించింది... అతడికి చాక్లెట్ చాలంతే...
, సోమవారం, 8 ఏప్రియల్ 2019 (20:30 IST)
పెళ్లంటే నూరేళ్ల పంట. కొందరికి ఇది మంటలా మారుతుంది. ముఖ్యంగా యువతుల విషయంలో అన్యాయం జరుగుతుంటుంది. అది వరకట్నం రూపేణా కావచ్చు, మరేమైనా కావచ్చు. తమకు పెళ్లీడు రాక మునుపే, పూర్తిస్థాయిలో అవగాహన కూడా లేక మునుపే కొందరు పెళ్లితో కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తుంటారు. మనువాడిన వాడు మానసిక స్థిమితం లేని వాడైతే ఇక అతడిని కట్టుకున్న యువతి పరిస్థితి ఎలా వుంటుంది. ఇక్కడ ఇలాంటి అనుభవాన్నే చవిచూసిన సన్నీ యాంజిల్ అనే మహిళ వింగ్స్ అనే పుస్తకంలో రాసుకుంది. 
 
ఆమె వెల్లడించిన వివరాలను చూస్తే... నాకు ఇరవై ఏళ్లప్పుడు బలవంతంగా పెళ్లి చేశారు. వరుడు ఎలాంటి వాడో కూడా నాకు తెలియదు. శోభనం ఏర్పాటు చేశారు. ఆ రోజు రాత్రి నా అత్త కిటికీ వద్ద నిలబడి నా భర్తకు ఏవో సైగలు చేస్తోంది. అతడు వెర్రి చూపులు చూస్తున్నాడు. కొద్దిసేపటికే అర్థమైంది అతడి మానసిక స్థితి సరిగా లేనివాడని. దాంతో ఆమె నా భర్తకు నాపై సెక్స్‌ చేయాలని చెప్పింది. నేను అంగీకరించకపోతే బట్టలు చించేయాలనీ, కొట్టి మరీ పని కానివ్వు అంటూ అతడిని ప్రోత్సహించేది. అలా బలవంతంగా అతడు నాపై అత్యాచారం చేసేవాడు.
 
నా భర్త అజయ్‌కు శృంగారమంటే తెలియదు. అందుకే అతడి తల్లి నా భర్తకు పోర్న్ వీడియోలు చూపించి అలా చేయాలని చెప్పేది. అంతటితో ఆగకుండా గది కిటికీ తలుపులు తెరిచి ఆమె అవతల వైపు వుండి సెక్స్ ఎలా చేయాలో సలహాలు ఇస్తుండేది. నా భర్తకు ఏమీ తెలియకపోవడంతో హింసించేవాడు. కనీసం ఆ సమయంలో అతడు తన దుస్తులు కూడా విప్పేవాడు కాదు. నాకు ఇష్టం లేదు అత్తయ్యా అంటే నన్ను కొట్టేది. హింసించేది. అలా నాపై వరుసగా అత్యాచారాలు చేయించేది. 
 
అతడు నాపై అత్యాచారం చేశాక... అమ్మా, చేసేశాను చాక్లెట్ ఇవ్వవూ అంటూ చాక్లెట్ తీసుకుని వెళ్లిపోయేవాడు. ఇలాంటి దారుణమైన స్థితి నాకొక్కదానికే కాదు ఎంతోమంది ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. పెళ్లికి కట్నంగా రూ.9,31,862, మెర్సిడెస్ కారు తీసుకున్నారు. ఏదో ఉన్నతస్థాయిలో బ్రతుకుతుందని తన పేరెంట్స్ పెళ్లి చేస్తే నా జీవితం నరకమైంది. ఐతే దాన్నుంచి తప్పించుకుని బయటపడ్డాను" అని వింగ్స్ అనే పుస్తకంలో పేర్కొంది యాంజిల్. ప్రస్తుతం లండన్‌లో వుంటున్న ఆమె విడాకులు తీసుకుంది. మరే అమ్మాయికి తనలా అన్యాయం జరుగకూడదని మహిళల కోసం పోరాటం చేస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోవిందరాజస్వామి కిరీటాలు దొరికాయ్.. ఎక్కడ..?