Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవుడు ఆదేశించాడు, రజినీకాంత్ ఆ పని చేస్తున్నాడు?

Webdunia
శనివారం, 24 అక్టోబరు 2020 (19:43 IST)
వచ్చే యేడాదే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు. ఇప్పటికే అధికార అన్నాడిఎంకే, ప్రతిపక్ష డిఎంకే పార్టీలు ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నాలు ప్రారంభించేశాయి. ముఖ్యంగా డిఎంకే పార్టీ అధినేత స్టాలిన్ అయితే ఏకంగా సభ్యత్వ నమోదుతో జనాన్ని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
దీంతో సూపర్ స్టార్ రజినీకాంత్ మెల్లమెల్లగా తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు సంకేతాలు చూపిస్తున్నారు. ముఖ్యంగా మక్కల్ మండ్రం అనే తన సొంత స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు రజినీకాంత్. తన అభిమాన సంఘంతో మాట్లాడిన రజినీ సభ్యత్వ నమోదును వేగవంతం చేయాలని ఆదేశించారట.
 
సభ్యత్వ నమోదు పూర్తయిన వెంటనే పార్టీని ప్రకటించి ఆ తరువాత ప్రజల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట రజినీ. అయితే ఈ సభ్యత్వ నమోదు పూర్తయ్యిందే సభ్యులకు ఫోటోలతో కూడిన గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూడా సూచించారట. ఎలాంటి ఆర్భాటంగా లేకుండా ప్రశాంతంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రకటన చేయాలన్నది రజినీ ఆలోచనట. ఇదే తన సన్నిహితులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈసారి తమిళనాడు ఎన్నికలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

దిల్ రాజు నన్ను ఇక్కడే ఉండాలనే గిరిగీయలేదు : తమ్ముడు డైరెక్టర్ శ్రీరామ్ వేణు

పూరి జగన్నాథ్, JB మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా విజయ్ సేతుపతి చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments