Wife: బైకుపై వెళ్తూ భర్త ముఖంపై యాసిడ్ పోసిన భార్య.. ఎందుకో తెలుసా?

సెల్వి
గురువారం, 21 ఆగస్టు 2025 (14:49 IST)
Crime
పశ్చిమ త్రిపుర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భర్తపై భార్య యాసిడ్‌తో దాడి చేసింది. ఏం చేయడమో తెలియక ఆ భర్త అయోమయ పరిస్థితుల్లో దాడికి గురై ఆస్పత్రి పాలయ్యాడు. ఈ ఘటన పశ్చిమ త్రిపుర జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన భర్తతో పాటు మోటారు బైకుపై వెళ్తున్న భార్య వెనక నుంచి భర్త ముఖంపై యాసిడ్‌తో దాడి చేసింది.  
 
వృత్తిరీత్యా రైతు అయిన షిబాజీ దేబ్బర్మ అనే ఆ వ్యక్తికి భార్య చేసిన అకృత్యానికి ముఖం, మెడపై తీవ్రగాయాలైనాయి. గాయాలతో ప్రస్తుతం జిబిపి ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. "షిబాజీ దేబ్బర్మ, అతని భార్య సుమిత్ర దేబ్బర్మ బుధవారం తన బైక్ పై చాంద్‌పూర్ వైపు ప్రయాణిస్తున్నారు. వున్నట్టుండి, సుమిత్ర తన భర్తపై యాసిడ్ పోసింది. 
 
ఈ ఘటనతో తీవ్రమైన నొప్పి కారణంగా అతను బైక్ ఆపి కిందకు దిగాడు" అని సిధై పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ (OC) హిమాద్రి సర్కార్ అన్నారు. "ఏమి జరిగిందో తెలియక, అతను సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించాడు. అయినా అతని భార్య మళ్ళీ అతనిపై మరింత యాసిడ్ పోయడానికి ప్రయత్నించింది. కానీ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ వ్యక్తిని వెంటనే జీబీపీ ఆస్పత్రికి  తరలించారు," అని హిమాద్రి సర్కార్ చెప్పారు. 
 
ఆ మహిళ గృహ హింస బాధితురాలిగా కనిపిస్తోందని, భర్త వేధింపులు తాళలేక అతనిపై యాసిడ్ దాడి చేసిందని హిమాద్రి సర్కార్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ G.O.A.T సినిమాకి బ్యాగ్రౌండ్ అందిస్తున్న మణిశర్మ

Aadi Pinisetty: బాలయ్య ముక్కు సూటి మనిషి, అల్లు అర్జున్ తో హలో హాయ్ అంతే.. : ఆది పినిశెట్టి

Shobhan Babu: సోగ్గాడు స్వర్ణోత్సవ పోస్టర్ రిలీజ్ చేసిన డి.సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments