Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటి నోరా ఫతేహీలా ఉండాలంటూ భార్య వర్కౌట్ చేయాలంటూ చిత్రహింసలు..

Advertiesment
wife workouts

ఠాగూర్

, గురువారం, 21 ఆగస్టు 2025 (10:42 IST)
ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహీలా తన భార్య ఉండాలని, ఇందుకోసం నాజుగ్గా ఉండేందుకు వీలుగా వర్కౌట్లు చేయాలంటూ భార్యను వేధిస్తూ, చిత్రహింసలకు భర్త గురిచేశాడు. పైగా, అందంగా లేవంటూ, లావుగా ఉన్నావంటూ నిత్యం వేధిస్తూ గంటల తరబడి వ్యాయామం చేయమని బలవంతం చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె గర్భందాల్చితే బలవంతంగా అబార్షన్ చేయించి చివరకు ఇంటి నుంచి గంటేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. 
 
పోలీసుల కథనం మేరకు.. బాధితురాలు షాను (26) కథనం మేరకు ప్రభుత్వ పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా పని చేస్తున్న శివమ్ ఉజ్వల్‌‍తో ఆమెకు ఈ యేడాది మార్చి 6వ తేదీన జరిగింది. పెళ్లి సమయంలో షాను కుటుంబం నగదు, నగలు, స్కార్పియో కారు రూపంలో సుమారు రూ.77 లక్షల కట్నం ఇచ్చింది. అయినప్పటికీ, పెళ్లయినప్పటికీ కొన్ని రోజులకే అత్తింటివారి అసలు స్వరూపం బయటపడింది. నోరా ఫతేహిలా నాజూకైన శరీరాకృతి కావాలంటూ భర్త ఆమెను రోజుకు మూడు గంటల పాటు వ్యాయాయం చేయమని ఒత్తిడి చేసేవాడు. ఏదైనా కారణంతో వ్యాయామం చేయకపోతే రోజుల తరబడి భజోనం పెట్టకుండా మాడ్చేసేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తన భర్తకు ఇతర మహిళల పట్ల ఆసక్తి ఎక్కువమని తరచూ వారి అసభ్యకర వీడియోలు చూసేవాడని షాను ఆరోపించింది. చిన్న చిన్న విషయాలకో భర్త చేయి చేసుకునేవరాడని, అత్తంటివారు అతడినే సమర్థించేవాడని వాపోయింది. తన మామ కేపీ సింగ్ ఎలాంటి సమాచారం లేకుండా తమ బెడ్‌రూమ్‌లోకి వచ్చేవాడని, ఇది తనకు తీవ్ర ఇబ్బందిగా ఉండేదని పేర్కొంది. 
 
ఈ క్రమంలో తాను గర్భందాల్చిన విషయం చెప్పగా అత్తింటివారు సంతోషించలేదని షాను తెలిపింది. కొన్ని రోజుల తర్వాత ఆడపడుచు రుచి ఓ మాత్ర ఇచ్చి బలవతంగా మింగించిందని, ఇంటర్నెట్‌లో వెతకగా అది అబార్షన్ పిల్ అని తెలిపిందని ఆమె చెప్పింది. ఆ తర్వాత ఆ పెరుగులో మసాలాలు కలిపి తినిపించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై, జూలై 9వ తేదీన ఆస్పత్రికి  వెళ్లగా గర్భస్రావం జరిగిందని వైద్యులు నిర్ధారించినట్టు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 
 
జూన్ 18వ తేదీ షాు తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత జూలై 26వ తేదీన తిరిగి అత్తింటికి వెళ్లగా ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారు. తన వస్తువులు, నగలు కూడా తిరిగి ఇవ్వలేదని చెప్పింది. దీంతో విసిగిపోయిన షాను ఈ నెల 14వ తేదీన భర్త శివమ్, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, గృహ హింస, గర్భస్రావానికి కారకులయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Google Pixel 10 : గూగుల్ పిక్సెల్ 10 స్మార్ట్‌ఫోన్‌, ఫీచర్స్.. విడుదల ఎప్పుడు?