అక్రమ సంబంధంతో పాటు ఇతరత్రా కారణాల చేత భర్తలను హత్య చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. తాజాగా తన భర్తను చంపేందుకు ఓ భార్య గూగుల్‌ను ప్లాన్ అడగటం స్థానికంగా కలకలం రేపింది. తన భర్తను హత్య చేసిన తర్వాత తప్పించుకునే మార్గాలను ఆమె గూగుల్, సోషల్ మీడియా వెతికినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంచలన ఘటన జైపూర్‌లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. ముహానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్య తన స్నేహితులతో కలిసి తన భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు మృతుడి భార్య సంతోష్ దేవి అని పోలీసులు తెలిపారు.
ఆమె తన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి భర్తను హత్య చేసిందని పోలీసులు తెలిపారు. నిత్యం తన భర్త తనను కొట్టడం, అనుమానాలతో వేధించడంతో విసిగిపోయిన సంతోష్ దేవి ఎలాగైనా తన భర్త మనోజ్‌ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ఆమె గూగుల్, సోషల్ మీడియా సాయం తీసుకుంది.
అలాగే స్నేహితుల సాయంతో భర్తను హత్య చేసింది. హత్య చేశాక తప్పించుకునే మార్గాలను సోషల్ మీడియాలో వెతికింది. అయితే గూగులే వారిని నిందితులను పట్టించింది. నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
హత్య తర్వాత వాళ్లు పట్టుబడకుండా ఉండచానికి గూగుల్‌లో అనేక కథనాలను చదివినట్లు తెలిపారు.
నిందితురాలు ఆ మహిళ తన భర్తను చంపడానికి, హత్య చేసే విధానం, తప్పించుకునే మార్గాలు, ఒకవేళ పోలీసులకు దొరికితే శిక్ష విధించే విధానాల గురించి గూగుల్‌లో అనేక వీడియోలను చూసిందని పోలీసులు తెలిపారు. ఆమె హత్య చేసే ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు, ఆమె హత్య కోసం కొత్త సిమ్ కార్డులను కూడా ఉపయోగించందని పోలీసులు తెలిపారు.