Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్డీ.తివారీ కుమారుడి హత్య కేసులో భార్యే ముద్దాయి

Webdunia
సోమవారం, 22 ఏప్రియల్ 2019 (11:29 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ముఖ్యమంత్రి ఎన్.డి.తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఆయన భార్యే అపూర్వనే ప్రధాన నిందితురాలని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు ఆమె పోలీసుసలకు ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. 
 
ఇటీవల రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఈనెల 16వ తేదీన ఆయన ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసును బుక్ చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టుతో రోహిత్‌ హత్యకు గురైనట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఈ కేసు విచారణను క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. 
 
ఈ కేసు విచారణలో భాగంగా రోహిత్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని 8 గంటల పాటు ప్రశ్నించారు. అపూర్వ, ఆమె తల్లిదండ్రులు తమ ప్రాపర్టీపై కన్నేశారని, తన కొడుకుని వారే హత్య చేసి ఉండవచ్చని ఆదివారం రోహిత్ తల్లి ఉజ్వల ఆరోపించారు. ఈ నేపథ్యంలో రోహిత్ హత్య కేసులో భార్య పాత్ర ఉన్నట్టు పోలీసులు బలంగా విశ్వసిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అల్లు అర్జున్ ఇష్యూకు చిరంజీవి సీరియస్ - రేవంత్ రెడ్డి పీఠానికి ఎసరు కానుందా?

బాలకృష్ణ కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం డాకు మహారాజ్ : చిత్ర దర్శక నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments