Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నలుపు రంగులో ఉన్నాడని పెట్రోల్‌తో తగలబెట్టేసింది!

Webdunia
బుధవారం, 17 ఏప్రియల్ 2019 (17:00 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త నల్లగా ఉన్నాడని ఓ భార్య అతనిపై పెట్రోల్ పోసి తగలెట్టేసింది. ఈ అమానుష ఘటన గత సోమవారం రోజున జరిగింది, అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బరేలీలో నివసిస్తున్న ప్రేమ్‌శ్రీ, సత్యవీర్‌సింగ్‌కు రెండేళ్ల క్రితం పెళ్లైంది. వీరిద్దరికి 5 నెలల పాప కూడా ఉంది. 
 
చూడటానికి అందంగా ఉండే ప్రేమ్‌శ్రీ తన భర్త నల్లగా ఉన్నాడంటూ బాధపడేది. ఎప్పుడూ అతని శరీర రంగును ప్రస్తావిస్తూ గొడవకు దిగేది. ఇది సాధారణ విషయంగానే కుటుంబసభ్యులు భావించారు. అయితే ప్రేమ్‌శ్రీ ఎవరూ ఊహించని ఘాతుకానికి పాల్పడింది. భర్త నలుపు రంగులో ఉండటాన్ని తట్టుకోలేని ప్రేమ్‌శ్రీ నిద్రిస్తున్న సమయంలో అతనిపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. 
 
తీవ్ర గాయాలపాలైన సత్యవీర్‌సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన సత్యవీర్‌సింగ్ సోదరుడు హర్వీర్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ప్రేమ్‌శ్రీ కాళ్లకు కూడా గాయాలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్‌తో అల్లు అర్జున్ లంచ్ మీట్.. స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన పుష్ప!

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతీ లీలావతి!

అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి నటుడు మోహన్ బాబు!

వైభవంగా బాలాజీ వీడియోస్ అధినేత నిరంజన్ పన్సారి కుమార్తె వివాహం

'మన హక్కు హైదరాబాద్' కర్టెన్ రైజర్ ప్రచార గీతం విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments