Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎవడితో కులుకుతున్నావ్ అంటూ భార్యను కత్తితో పొడిచి తల నరికేశాడు...

Advertiesment
ఎవడితో కులుకుతున్నావ్ అంటూ భార్యను కత్తితో పొడిచి తల నరికేశాడు...
, బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:59 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణమైన ఘటన జరిగింది. కట్టుకున్న భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆమెను విచక్షణారహితంగా పొడిచి ఆ తర్వాత ఆమె తలను నరికేశాడు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా వున్నాయి.
 
కర్నాటకకు చెందిన 18 ఏళ్ల మునియప్పన్ 19 ఏళ్ల నివేదతో పెళ్లయింది. వివాహం అయిన తర్వాత ఉపాధి నిమిత్తం వారు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ సమీపంలోని మెట్టుకడాయ్ ప్రాంతానికి వలస వచ్చారు. అక్కడ మునియప్పన్ ఓ గ్యాస్ ఏజెన్సీలో పని కుదుర్చుకుని చేస్తున్నాడు. అతడి భార్య సమీపంలోని ఓ దుకాణంలో చేస్తోంది. ఐతే దుకాణంలో పనిచేస్తున్న తన భార్య కొందరు యువకులతో వివాహేతర సంబంధం పెట్టుకుందని అతడు అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై పలుమార్లు ఆమెతో గొడవపడ్డాడు. 
 
చివరికి సోమవారం నాడు ఇద్దరి మధ్య వాగ్వాదం పెచ్చుమీరింది. దీనితో అతడు కత్తి తీసుకుని ఆమెను పొడిచేసాడు. అంతటితో ఆగకుండా ఆమె తల నరికి వేరు చేసి ఆమె శరీర భాగాలను గోనె సంచిలో మూటగట్టి తన ద్విచక్ర వాహనంపై వేసుకుని బయలుదేరాడు. ఆమె మృతదేహాన్ని సమీపంలోని చెరువులో పడవేసేందుకు చూస్తుండగా స్థానికులు గోనె సంచిలో మృతదేహం కాళ్ల బయటకు కనబడటంతో భయాందోళనలకు గురై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శబరిమల తరహాలో మసీదుల్లో మహిళలు ప్రవేశం కల్పించండి..