Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యే సర్వస్వం అనుకున్నా, కానీ పక్కింటి యువకుడు అందంగా ఉన్నాడనీ...

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (21:53 IST)
అతనిలో కోపం..ఆవేశం..తగ్గలేదు. ఒళ్ళంతా నెత్తుటి మరకలు. పోలీసులు అతన్ని చూసి ఏం జరిగిందని అడుగుతున్నారు. భార్యను చంపి నేరుగా మీ దగ్గరకే వస్తున్నానన్నాడు ఆవేశంగా. ఎందుకు చంపావని రాత్రి వేళ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్ళు అడుగుతున్నారు. అతని ఆవేశం మరింత రెట్టింపయ్యింది. అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు. 
 
నా పేరు సాదన్ సర్. నా భార్య పేరు దీపాలీ. ఆమెకు 38 యేళ్ళు సర్. నేను కూరగాయల వ్యాపారం చేస్తున్నాను. ఇక్కడే పక్కన బస్తీలో ఉన్నాం. నాకు ఇంకా పిల్లలు లేరు. భార్యే సర్వస్వం అనుకున్నాను. కానీ ఆమె నన్ను మోసం చేస్తుందని అనుకోలేదు. 
 
వారం క్రితం కూరగాయలు కొనేందుకు మా ఇంటి దగ్గర ఉన్న కొంతమంది యువకులు నా దగ్గరికి వచ్చారు. మీ ఆవిడ మీ పక్కింట్లో ఉన్న ఆ అందమైన కుర్రాడితో తిరుగుతోందన్నారు. నేను మొదట్లో నమ్మలేదు. ఇంటికి సమీపంలో ఉన్న వారు నా దగ్గరికి వచ్చారు. మీ ఇంటికి ఆ యువకుడి వచ్చి పోతున్నాడన్నారు.
 
అప్పుడు నమ్మాను. నా భార్యను నిలదీశా. ఆమె మౌనంగా ఉంది. సరే అని ఊరుకున్నాను. కానీ నిన్న మధ్యాహ్నం భోజనం చేసి మార్కెట్‌కు వెళ్ళా. సాయంత్రం 7 గంటలకు ఇంటికి వచ్చాను. నా భార్య ఇంట్లో లేదు. పక్కింటి వాళ్ళని అడిగాను. ఎక్కడికి వెళ్ళిందో తెలియదన్నారు.
 
పక్కనే ఉన్న యువకుడి ఇంటికి వెళ్ళి చూశాను. అతను లేడు. నా భార్య ఇంటికి రాత్రి 10.30కి వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అడిగాను. నిన్ను చూస్తే నాకు బోర్ కొడుతోంది. పక్కింటి వాడు అందంగా ఉన్నాడు. నన్ను ఎంజాయ్ చేయని అంది.
 
నాకు కోపం ఆగలేదు. టెంకాయలు నరికే కత్తి పక్కనే ఉంది. ఒక్కసారిగా ఆమెను నరికేశాను. అంతే ఆమె నెత్తుటి మరకలో ఉంది. నాకు తెలిసి చనిపోయింది అనుకుంటున్నాను. నన్ను అరెస్టు చేయండి సార్ అంటూ వచ్చి నిలబడ్డాడు సాధన్. సాధన్ సొంత రాష్ట్రం పశ్చిమబంగాల్ హస్నాబాద్. ఈ ఘటన కాస్త రాష్ట్రంలో సంచలనంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments