Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా పెళ్లాన్ని నా దగ్గరకు పంపవా? ఐతే నువ్వు చావాల్సిందే... అత్తను హత్య చేసిన అల్లుడు

నా పెళ్లాన్ని నా దగ్గరకు పంపవా? ఐతే నువ్వు చావాల్సిందే... అత్తను హత్య చేసిన అల్లుడు
Webdunia
సోమవారం, 27 మే 2019 (18:27 IST)
మనుషుల్లో ఓర్పు క్రమంగా తగ్గిపోతోంది. చిన్నచిన్న సమస్యలనే సుడిగుండాలుగా మార్చేసుకుంటున్నారు. మొండితనం ఎక్కువవుతోంది. ప్రతి చిన్న విషయానికి అవతలి వ్యక్తిపైన విపరీతమైన ద్వేషం పెంచుకుంటున్నారు. మారుతున్న పరిస్థితులే ఇందుకు కారణం. అందువల్ల ఈమధ్య కాలంలో హత్యలు ఇతర దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయి. తమిళనాడులో తన కుమార్తెను వేధిస్తున్నందుకు అల్లుడి వద్దకు పంపను అన్నందుకు ఆమెను హత్య చేశాడు అల్లుడు. 
 
పూర్తి వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా వండలూరు సమీపంలో సతీష్ కుమార్, సుష్మిత వుంటున్నారు. పెళ్లయి ఏడాది దాటింది. ఇటీవలి ఈ ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. వీటి కారణంగా సతీష్ ఓ రోజు సుస్మితపై చేయిచేసుకున్నాడు. దీనితో సుస్మిత తల్లి విషయం తెలుసుకుని కుమార్తెను తమ ఇంటికి తీసుకువెళ్లింది. ఆ తర్వాత కొన్నిరోజులకి సతీష్ అత్తింటికి వెళ్లాడు. తన భార్యను తనతో పంపాలనీ, కాపురం చేసుకుంటానని అడిగాడు. దాంతో సుస్మిత తల్లి అందుకు ససేమిరా అన్నది. 
 
ఆమె అలా అనేసరికి సతీష్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. అర్థరాత్రి దాటాక అంతా నిద్రిస్తున్న సమయంలో పదునైన కత్తి తీసుకుని నిద్రిస్తున్న అత్త గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. తన తల్లి రక్తపు మడుగులో పడి వుండటాన్ని చూసిన సుస్మిత విషయాన్ని పోలీసులకు తెలియజేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' చిత్ర ట్రైలర్ విడుదల

'స్వప్నాల నావ'.. సిరివెన్నెల సీతారామశాస్త్రికి అంకితం : దర్శకుడు వి.ఎన్.ఆదిత్య

'డాకు మహారాజ్‌' మనందరి సినిమా.. ఆదరించండి : నిర్మాత నాగవంశీ

పవన్ కళ్యాణ్ వున్నా, రామ్ చరణ్ వున్నా మూలాలు చిరంజీవిగారే: పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్

తండేల్ నుంచి శివ శక్తి సాంగ్ నమో నమః శివాయ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments