నీవు సుఖపెట్టలేవు.. నీ తమ్ముడుతో సుఖం పొందితే తప్పేంటి...

సోమవారం, 20 మే 2019 (13:53 IST)
బెంగుళూరులో ఓ మహిళ హత్యకు గురైంది. ఆమెను కట్టుకున్న భర్తే హత్య చేశాడు. తన భర్త తమ్ముడు (వరుసకు మరిది)తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త... కట్టకున్న భార్యను నిలదీశాడు. దీనికి ఆమె పెడసరిగా సమాధానం చెప్పింది. ముఖ్యంగా, ఎలాగూ.. నీవు సుఖం ఇవ్వలేకపోతున్నావు.. నీ తమ్ముడుతో పడక సుఖం పొందితే తప్పేంటి అంటూ ఎదుర ప్రశ్నించింది. అంతే.. ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో భార్యను కొట్టి చంపేశాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లా కేంద్రం సమీపం వేపాలంపట్టి గ్రామంలో దంపతులు నివాసముండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, భర్త తమ్ముడు (మరిది)తో ఆ మహిళకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసి పలుమార్లు గొడవపడేవారు. కాని వారు మాత్రం తమ వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఈ విషయమై శనివారం రాత్రి కూడా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
 
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇంటి ఆరు బయట పడుకుని ఉన్న తన భార్యను భర్త వేటకొడవలితో నరికి చంపాడు. తర్వాత నేరుగా బర్గూరు పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. తన భార్య, తన తమ్ముడికి మధ్య వివాహేతర సంబంధం ఉన్న కారణంగానే ఈ హత్య చేశారని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో సోయలో లేని జనసేన...