బీజేపీ నుంచి దేవుడు ముఖం తిప్పుకున్నాడు.. యూపీ బైపోల్ రిజల్ట్స్‌పై సంజయ్ రౌత్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు.

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (15:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఈ ఫలితాల సరళిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఆయన బుధవారం పార్లమెంట్ వద్ద స్పందిస్తూ... 'ఎస్పీ-బీఎస్పీ చేతులు కలపడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయని నేను భావించడం లేదు. శ్రీరాముడిని అవమానించిన ఎస్పీ నాయకుడికి మీరు ఎర్రతివాచీ పరిచిన రోజే... దేవుడు మీ నుంచి ముఖం తిప్పుకున్నాడు...' అంటూ వ్యాఖ్యానించారు. 
 
కాగా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లేందుకు అవకాశం రాకపోవడంతో... ఆ పార్టీ సీనియర్ నేత నరేశ్ అగర్వాల్ రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు, ఎస్పీ ఎమ్మెల్యే నితిన్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తరపున జయాబచ్చన్‌ రాజ్యసభకు నామినేషన్ వేయగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీలో చేరుతూ చేరుతూనే జయాబచ్చన్‌పై నరేశ్ అగర్వాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇపుడు ఊహించని ఫలితాలపై కమలనాథులు షాక్‌కు గురయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాక్టర్ రాజశేఖర్ కాలికి గాయం.. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరం

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments