Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలు ఈ తాలిబన్లు ఎవరు? ఆ పదం ఎక్కడ నుంచి వచ్చింది?

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (15:47 IST)
తాలిబ‌న్ అనే ప‌దం తాలిబ్ అనే అర‌బిక్ ప‌దం నుంచి వచ్చింది. తాలిబ్ అంటే విద్యార్థి అని అర్థం. పాకిస్తాన్ కి చెందిన మ‌త‌ప‌ర‌మైన స్కూలు విద్యార్థులు దీనిని స్థాపించారు కాబ‌ట్టి ఈ మిలిటెంట్ గ్రూప్‌కు తాలిబ‌న్లు అనే పేరు వ‌చ్చింది. పాకిస్తాన్‌లోని ఆదివాసీ ప్రాంతాల్లో పఖ్తూన్ హక్కుల కోసం మొదలైన ఈ ఉద్యమం మొదట్లో మత సంస్థలలోనే కనిపించేది. 
 
సున్నీ అతివాద ఇస్లాం బోధలు చేసే ఈ మత సంస్థలకు నిధులు చాలా వరకు సౌదీ అరేబియా నుంచి అందేవి. తమకు కనుక అధికారం వస్తే పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ల మధ్య ఉండే పఖ్తూన్ ప్రాంతంలో ‘కఠినమైన షరియా లేదా ఇస్లాం చట్టాన్ని అమలు చేసి శాంతిభద్రతలు నెలకొల్పుతామని తాలిబన్లు అక్కడి వారికి హామీ ఇచ్చారు.
 
ప్రస్తుతం 75 వేల మంది వరకు ఉన్న తాలిబన్ గ్రూప్ ని..1989లో పఖ్తూన్ తెగ‌కు చెందిన ముల్లా మొహ‌మ్మ‌ద్ ఒమ‌ర్ ద‌క్షిణ అఫ్ఘ‌ానిస్తాన్ లో ప్రారంభించాడు. ముజాహిదీన్ క‌మాండ‌ర్‌గా మారిన అత‌డు..ఆ ఏడాది సోవియ‌ట్ల‌ను దేశం నుంచి త‌రిమివేయ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. 1994లో కాంద‌హార్ చేరిన ముల్లా.. 50 మంది అనుచ‌రుల‌తో ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. అక్క‌డి నుంచి త‌న సంస్థ‌ను బ‌లోపేతం చేసుకుంటూ వెళ్లిన ముల్లా.. రెండేళ్ల‌లోనే కాంద‌హార్‌తోపాటు రాజ‌ధాని కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
 
వీళ్లు త‌మ‌కు తాము ఇస్లామిక్ ఎమిరేట్స్ ఆఫ్ అఫ్ఘానిస్తాన్ గా చెప్పుకుంటారు. రాజ‌కీయ అస్థిర‌త‌, ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాన్ని ఆస‌రాగా చేసుకొని తాలిబ‌న్లు చాలా వేగంగా దేశం మొత్తం విస్త‌రించారు. 1996-2001 మధ్య కాలంలో అఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు అధికారంలో ఉన్నారు. 
 
కఠినమైన ఇస్లామిక్ చట్టాలను అప్పట్లో తాలిబన్లు అమలు చేశారు. తొలినాళ్లలో, దేశంలో అవినీతిని అణచివేయడంలో, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టడంలో,వాళ్ళ అధీనంలో ఉన్న రోడ్లు, ప్రాంతాలను వ్యాపారాభివృద్ధికి అనువుగా చేయడంతో తాలిబన్లు బాగా పాపులారిటీ సంపాదించారు.
 
కానీ, వీటితో పాటు తాలిబన్లు శిక్ష పడిన హంతకులను, మోసం చేసినవారిని బహిరంగంగా ఉరి తీయడం, దొంగతనం చేసిన వారికి కాళ్లు చేతులు విరిచి అంగవికలుగా చేయడం లాంటి ఇస్లామిక్ శిక్షలను కూడా ప్రవేశపెట్టారు. పురుషులందరూ కచ్చితంగా గెడ్డం పెంచుకోవాలని, మహిళలు బురఖా ధరించాలనే నియమాలను కూడా విధించారు. టెలివిజన్, సినిమాలు చూడటాన్ని, సంగీతం వినడాన్ని నిషేధించారు. 
 
10 ఏళ్లు నిండిన అమ్మాయిలను బడికి పంపడాన్ని కూడా ఆమోదించలేదు. అయితే అమెరికాలోని వ‌ర‌ల్డ్ ట్రేడ్ సెంట‌ర్‌పై దాడిలో ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన ఒసామా బిన్ లాడెన్‌కు ఈ తాలిబ‌న్లే ఆశ్ర‌యం క‌ల్పించారు. బిన్ లాడెన్ ని త‌మ‌కు అప్ప‌గించాల్సిందిగా అమెరికా డిమాండ్ చేసినా తాలిబ‌న్లు విన‌క‌పోవ‌డంతో.. ఇక అగ్ర‌రాజ్య ద‌ళాలు ఆ దేశంలో అడుగుపెట్టాయి. 
 
దీంతో ముల్లా ఒమ‌ర్‌, మిగ‌తా తాలిబ‌న్ లీడ‌ర్లు అఫ్ఘ‌ానిస్తాన్ నుంచి పారిపోయి పాకిస్తాన్ త‌ల‌దాచుకున్నారు. 2001 నుంచి మొన్నటివరకూ అమెరికా ద‌ళాలు అఫ్ఘానిస్తాన్ లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పుడు అమెరికా సేనలు వెళ్లిపోవడంతో మళ్లీ అప్ఘానిస్తాన్ లో అధికారం చేపట్టేందుకు తాలిబన్లు రెడీ అయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments