Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తాలిబన్ల చెరలో ఆఫ్ఘనిస్థాన్ గగనతలం మూసివేత : అమెరికా సైన్యం కాల్పులు

తాలిబన్ల చెరలో ఆఫ్ఘనిస్థాన్ గగనతలం మూసివేత : అమెరికా సైన్యం కాల్పులు
, సోమవారం, 16 ఆగస్టు 2021 (13:56 IST)
ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించేసుకోవడంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చాలా మంది దేశం విడిచి వెళ్లిపోతున్నారు. ఏ విమానం దొరికితే ఆ విమానం ఎక్కేస్తున్నారు. దీంతో కాబూల్ విమానాశ్రయం మొత్తం గుంపులుగా వస్తున్న జనాలతో నిండిపోయింది. ఏ రన్ వే చూసినా ప్రజల హడావుడే కనిపిస్తోంది.
 
సోమవారం ఉదయం ప్రజలు కాబూల్ ఎయిర్ పోర్టులోని టార్మాక్ వద్దకు చొచ్చుకొస్తుండడంతో.. ఆ విమానాశ్రయాన్ని తమ అధీనంలో ఉంచుకున్న అమెరికా సైన్యం కాల్పులు జరిపింది. ప్రజలను చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్చింది. 
 
కొందరు విమానం ఎక్కేందుకు పోటీపడి తోసుకుంటున్నారు. మెట్ల దారిలోని కాకుండా పక్క నుంచి కూడా ఎక్కే ప్రయత్నం చేశారు. ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే కాల్పుల్లో చనిపోయారా? లేదా తొక్కిసలాటలో చనిపోయారా? అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. అధికారులు కూడా దీనిపై ఇంతవరకూ స్పందించలేదు.
 
ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌లో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇప్పటికే చాలా మంది ప్రజలను ఆ ప్రదేశం నుంచి అమెరికా సైన్యం తరలించింది. ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన అనుచరులు తజికిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. 
 
దీంతో దేశం విడిచి వెళ్తున్న ఆఫ్ఘన్ ప్రజల కోసం పలు దేశాలు ఆపన్న హస్తాన్ని అందజేస్తున్నాయి. అందులో భారత్ మొదటి వరుసలో ఉంది. చాలా మంది ఆఫ్ఘనీలు భారత్ వైపే చూస్తున్నారు. విద్య, వైద్యం, ఇతర అన్ని విషయాల్లో మన దేశం మంచిదని వారు భావిస్తున్నారు.
 
మరోవైపు, తాలిబన్లు ఆప్ఘానిస్తాన్‌ను ఆక్రమించుకుండటంతో ఆ దేశంలోని సామాన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏ నిమిషంలో ఏమి జ‌రుగుతుందో తెలియ‌క అక్కడి ప్రజలు భ‌య‌ప‌డుతున్నారు. 
 
విదేశాలకే పారిపోవడానికి విమానశ్రయానికి చేరుకుంటున్నారు ప్రజలు. దీంతో విమానాశ్రయం జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రంతా విమానాల కోసం పడిగాపులు కాచారు. అక్కడ ఏ విమానం కనిపించినా అందులో ఎక్కి ప్రాణాలతో బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. టిక్కెట్ ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధం.. తమకు విమానంలో టిక్కెట్ ఇవ్వాలని వేడుకుంటున్నారు. 
 
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. వందలాది మంది విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. మరో వైపు కాబూల్ జైళ్ల నుంచి ఖైదీలు విడుదల చేశారు. వీరిలో కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు కూడా ఉన్నారు. ఇపుడు వీరంతా స్వేచ్ఛా జీవులయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో మూసివేత.. విదేశీయుల ఆందోళన