Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాటేసిన నాటు సారా.. ఏడుగురు మృత్యువాత

Webdunia
బుధవారం, 20 జులై 2022 (16:46 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో నాటు సారా కాటేసింది. దీంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరికొందరు అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు. 
 
మంగళవారం రాత్రి  నాటు సారా తాగిన అనేక మంది అస్వస్థతకు లోనయ్యారని స్థానిక అధికారులు తెలిపారు. వీరిలో అనేక మంది వాంతులు, విరేచనాలు చేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి వారిలో కొందరు తమ ఇంట్లోనే చనిపోయారు. విషమంగా ఉన్న వారిని హౌరా, టీఎల్ జైస్వాల్ ఆస్పత్రులకు తరలించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అత్యంత విషమ పరిస్థితిలో 20 మంది ఆస్పత్రిలో చేరినట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ కల్తీసారా విక్రయాలు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరగడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments