Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిగారి పైత్యం... వర్షం కోసం కప్పలకు పెళ్లి.. శోభనం ఎపుడంటున్న నెటిజన్లు..

దేశంలో వరుణదేవుడు కరుణించాలని కోరుతూ ఓ మంత్రిగారు రెండు కప్పలకు పెళ్లి చేశాడు. ఈ కప్పల పెళ్లి చూడటానికి పెద్దఎత్తున అ ప్రాంత ప్రజలు రావడం గమనార్హం. పైగా, ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించి, మంచి విందు

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (16:43 IST)
దేశంలో వరుణదేవుడు కరుణించాలని కోరుతూ ఓ మంత్రిగారు రెండు కప్పలకు పెళ్లి చేశాడు. ఈ కప్పల పెళ్లి చూడటానికి పెద్దఎత్తున అ ప్రాంత ప్రజలు రావడం గమనార్హం. పైగా, ఈ పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించి, మంచి విందు భోజన కూడా పెట్టారు. శుక్రవారం జరిగిన ఈ కప్పల పెళ్లి వివరాలు, ఈ పెళ్లిని నిర్వహించిన మంత్రివర్యుల వివరాలను తెలుసుకుందాం.
 
మధ్యప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లలితా యాదవ్ కొనసాగుతున్నారు. ఈమె వర్షాలు పడాలని కోరుతూ శుక్రవారం రెండు కప్పలకు వివాహం జరిపించారు. సహచర బీజేపీ నేతలతో కలిసి లలితా యాదవ్ అసద్ ఉత్సవ్ పేరుతో చత్తర్‌‌పూర్‌‌లోని ఓ గుడిలో ఈ కప్పల వివాహ కార్యక్రమాన్ని జరిగింది. 
 
ఇందులోభాగంగా లలితా యాదవ్ పూజరి బ్రిజనందన్ ఆధ్వర్యంలో ఓ గుడిలో రెండు కప్పలకు పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పెళ్లిని చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చారు. అంతేకాకుండా ఈ పెళ్లికి బ్యాండ్ బాజాలు కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి తర్వాత విందుభోజనాలు కూడా వడ్డించారు. పెద్ద పండుగలా ఈ కప్పల పెళ్లి  కార్యక్రమం జరిగింది.
 
ఈ కప్పలపై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. కప్పలకు పెళ్లి చేశారు సరే వాటికి శోభన కార్యక్రమం ఎప్పుడు జరిపిస్తారో చెప్పండంటూ మంత్రిగారిపై నిటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వాటిని హనీమూన్‌కి ఊటీకి పంపిస్తారా లేక విదేశాలకు పంపిస్తారా అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments