Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సీరీస్ పిచ్చి , 75 మంది ప్రాణాలను కాపాడింది, ఎక్కడ, ఎలా?

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (18:43 IST)
సాధారణంగా కొందరు సినిమాలపై మోజు పెంచుకుంటూ అందులోనే నిమగ్నమై పోతుంటారు. దీనికోసం తమ సమయాన్ని లెక్క పెట్టకుండా కాలయాపన చేస్తుంటారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి వెబ్ సీరీస్ పైన పెంచుకున్న మోజు చివరికి 75 మంది ప్రాణాలను రక్షించింది. అసలు వెబ్ సీరీస్ వల్ల ప్రాణాలు కాపాడడం ఎలా అని కొందరు తికమకలవుతారు కానీ ఇది నిజమని నిరూపించాడు ఓ యువకుడు.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మహారాష్ట్రలో దొంబివిలి, కాపర్ ఏరియాకు చెందిన కునాల్ అనే యువకుడికి వెబ్ సీరీస్ అంటే పిచ్చి. రాత్రింబవళ్లు లెక్క చెయ్యకుండా చూస్తుంటాడు. అతడు బుధవారం రాత్రి నుంచి ఉదయం నాలుగు గంటల వరకు చూస్తున్నాడు. ఈ క్రమంలో తానుండే రెండంతస్థుల భవనంలో ఓ భాగం కూలిపోవడం గమనించాడు.
 
దీంతో అప్రమత్తమై ఆ భవనంలో నిద్రిస్తున్న 75 మందిని లేపి అప్రమత్తం చేశాడు. అందరూ భయపడి పరుగులు పెడుతూ బయటికి వచ్చేశారు. చూస్తున్న సమయంలోనే ఆ భవనం కుప్ప కూలిపోయింది. కానీ శిథిలావస్థలో ఉన్న ఈ భవనాన్ని ఖాళీ చెయ్యమని అధికారులు తొమ్మిది నెలలకు ముందే నోటీసులు జారీ చేశారు. 75 మంది ప్రాణాలను రక్షించిన కునాల్‌ను అందరూ మెచ్చుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments