Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియుడి మోజు.. భర్తను సెల్‌ఫోన్ ఛార్జర్ వైర్‌తో హత్య చేసి.. ఫ్యానుకు ఉరేసింది..

Webdunia
శనివారం, 31 అక్టోబరు 2020 (18:32 IST)
అక్రమ సంబంధాలతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి ఓ మహిళ కట్టుకున్న భర్తనే దారుణంగా హత్య చేసింది. అదికూడా సెల్‌ఫోన్ చార్జింగ్ మెడకు చుట్టి భర్తను హత్యచేసి.. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ చివరికి దొరికిపోయింది. 
 
శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొత్తూరు కాలేజ్ రోడ్డుకు అనుకుని రాము(35), కుమారి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పాప శ్రీజ(7), బాబు సిద్దూ(5) ఉన్నారు. అయితే అక్టోబర్ 26న మరణించాడు.
 
ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీతో ఊరివేసుకుని ఉన్నట్టు కనిపించాడు. తొలుత అంతా ఆత్మహత్య అని భావించగా...అతని తల్లి మాత్రం తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వాదించింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రాముమృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి పంపించారు. అయితే పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లో రాముది హత్యగా తేలింది. దీంతో పోలీసులు రాము మృతిపై విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో భార్యే నిందితురాలని తేలింది. 
 
రాము భార్య కుమారికి అదే గ్రామానికి చెందిన సొండి సతీష్‌తో వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు గుర్తించారు. దీంతో కుమారితోపాటు సతీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వారిద్దరు నేరాన్ని అంగీకరించారు. రామును సెల్‌ఫోన్ చార్జర్‌తో హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ కాలికి స్వల్ప గాయాలు.. రెండు వారాల పాటు విశ్రాంతి (video)

Akella: ఆకెళ్ల సూర్యనారాయణ ఇక లేరు

Washi Yo Washi from OG: పవన్ పాడిన వాషి యో వాషి సాంగ్ రిలీజ్.. ఫ్యాన్స్‌కు మెగా విందు

Bhadrakali review: సమకాలీన రాజకీయచతురతతో విజయ్ ఆంటోని భద్రకాళి చిత్రం రివ్యూ

Kiran Abbavaram: కేరళ బ్యాక్ డ్రాప్ లో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

రీస్టార్ట్ విత్ ఇన్పోసిస్.. మహిళా ఉద్యోగులకు శుభవార్త.. ఏంటది?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

పండుగ కలెక్షన్ మియారాను విడుదల చేసిన తనైరా

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments