Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాక్‌పై పడిన చిన్నారి... దూసుకెళ్లిన రైలు.. (Video)

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (09:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర రైల్వే స్టేషన్‌లో ఓ అద్భుతం చోటుచేసుకుంది. ఒక యేడాది వయసున్న చిన్నారి ట్రాక్‌పై పడిపోయింది. అంతలోనే ఆ చిన్నారి పైనుంచి ఓ రైలు దూసుకెళ్లింది. అయినప్పటికీ ఆ పాప చిన్నపాటి గాయంకూడా లేకుండా ప్రాణాలతో బయటపడింది. దీనితాలుకూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ జంట తమ ఏడాది వయసున్న చిన్నారితో మధుర రైల్వే స్టేషన్ ఒకటో నంబరు ఫ్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచివున్నారు. పాప చేతిని తల్లి పట్టుకునివుంది. ఇంతలో వెనుక నుంచి ఆ మహిళను ఎవరో తగిలారు. దీంతో చేతిలోనుంచి పాప జారి రైలు పట్టాలకు ఫ్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. 
 
చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నించిన సమయంలోనే ఓ రైలు వైగంగా పాప పడిన ట్రాక్‌పైనే దూసుకెళ్లింది. అంతే.. ఒక్క క్షణం ప్రతి ఒక్కరూ అయ్యో అంటూ బిగ్గరగా కేకలు పెట్టారు. పాప ఇక లేరని అంతా టెన్షన్ పడిపోయారు. కానీ, రైలు వెళ్లిపోయిన అనంతరం ఆ పాప బిగ్గరకా ఏడుస్తూ కనిపించింది. వెంటనే ఓ వ్యక్తి పట్టాలపైకి దూకి చిన్నారిని చేతుల్లోకి తీసుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఆ చిన్నారికి చిన్నపాటి గాయం కూడా లేకుండా బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతూ ఊపిరిపీల్చుకున్నారు.


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments