Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయప్రద కంట కన్నీరు.. యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరించారట

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:10 IST)
ఇటీవల భాజపాలో చేరిన ప్రముఖ అందాల నటి జయప్రద కన్నీరు పెట్టుకున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ నియోజవర్గం నుండి పోటీ చేస్తున్న జయప్రద... ఈ సందర్భంగా రామ్‌పూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని... ఓట్లు వేయమని కోరడంతోపాటు కన్నీళ్లు పెట్టుకుంటూనే ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు కూడా గుప్పించేసారు.
 
వివరాలలోకి వెళ్తే... ప్రచార సభలో మాట్లాడిన ఆవిడ... భాజపా తనకు పుట్టిన రోజు కానుకగా రామ్‌పూర్‌ టికెట్‌ను బహుమతిగా ఇచ్చిందనీ... దీని ద్వారా తాను మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని పొందానని చెప్పుకొచ్చారు. కానీ సమాజ్‌వాదీ పార్టీ నేత అజాం ఖాన్‌ తన మీద ఎన్నో ఆరోపణలు చేసారన్నారు.

తనను రామ్‌పూర్‌ నుంచి వెళ్లిపోవాలంటూ డిమాండ్‌ చేసారనీ... వెళ్లకపోతే యాసిడ్‌ దాడులు చేస్తామని బెదిరించారనీ బోరున విలపించారు. వెంటనే అక్కడున్న భాజపా కార్యకర్తలందరూ వేదిక వద్దకు వచ్చి ఆమెను ఓదార్చుతూ... ఎన్నికలు పూర్తయ్యే వరకు జయప్రదకు మద్దతుగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేసారు.
 
కొంత సేపటి తర్వాత ఆవిడ మళ్లీ మాట్లాడుతూ... తొలిసారి తన వెనుక భాజపా బలం ఉందనీ... ఇంతకు ముందులా ఇంకెప్పుడూ ఏడవబోననీ... తనకు బతికే హక్కుందనీ... బతుకుతాననీ... తనను ఎవ్వరు ఏమీ చేయలేరనీ... భాజపాలో చేరతానంటే తనను కొందరు హెచ్చరించారనీ చెప్పారు. 

కానీ ప్రజాసేవకు ఈ పార్టీయే తనకు మంచిదిగా తోచిందని చెప్పుకొచ్చారు. తాను గెలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పిన ఆవిడ... మరోసారి ప్రజలకు సేవ చేసే అవకాశం ఇమ్మని దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన ఆశీర్వాదంతోపాటు మీ ఆశీర్వాదం కూడా కావాలి అని ముగించడం జరిగింది.
 
మరి హామీలకు కూడా పడని ఓటర్లు ఎవరైనా ఉంటే నేతల కన్నీళ్లకు పడిపోతారేమో... మన నేతలు కూడా ఇదే సూత్రం ఫాలో అయితే బాగుంటుందేమో... ఒకసారి ట్రై చేసి చూస్తారా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments