Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూకాశ్మీర్‌లో వివాహం.. డేట్ ఫిక్స్ 18న పెళ్లికూతురు కానున్న ఆమ్రపాలి

ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్‌ను జమ్మూకాశ్మీర్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వివాహం చేసుకోనున్నారు. ఈ నెల 18న ఈ జంట వివాహం జరుగనుండగా, 23న వరంగల్‌లో 25న హైదరాబాద

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (11:29 IST)
ఐపీఎస్ అధికారి, పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ ఆర్కే శర్మ కుమారుడు సమీర్‌ను జమ్మూకాశ్మీర్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వివాహం చేసుకోనున్నారు. ఈ నెల 18న ఈ జంట వివాహం జరుగనుండగా, 23న వరంగల్‌లో 25న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
హైదరాబాద్‌లో జరిగే విందుకు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు మంత్రులు, అధికారులు, సెలబ్రిటీలు మొత్తం 500 మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. ఆపై 26వ తేదీన వెళ్లనున్న ఆమ్రపాలి.. సమీర్ జంట మార్చి 7వరకూ అక్కడే గడపనుంది. ఇకపోతే.. త్వరలోనే ఆమ్రపాలి పెళ్లి కుమార్తె కానున్నారు. ఆమ్రపాలి వివాహంపై సోషల్ మీడియాలో గత కొన్ని వారాలుగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఈ వివాహం జమ్మూ కాశ్మీర్‌లో జరగనుండగా, ఆపై 23న వరంగల్‌లో, 25న హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటైంది. విందుకు ఆహ్వానం పలుకుతూ, పత్రికలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. కానీ పెళ్లి పత్రికలో అచ్చు తప్పు దొర్లింది. 

23న జరిగే విందు ఆహ్వాన పత్రికలో శుక్రవారం బదులు ఆదివారం అని అచ్చు తప్పు పడింది. దీన్ని శుక్రవారంగా సరిచేస్తూ స్టిక్కర్ వేసి ఆహ్వానాలను అందిస్తున్నారు. హనుమకొండలోని సుబేదారి ప్రాంతంలో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో 23న సాయంత్రం 6 గంటల నుంచి రిసెప్షన్ సాగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

New Year 2025, పుట్టపర్తి సత్యసాయి మందిరంలో నూతన సంవత్సర వేడుకలు: నటి సాయిపల్లవి భజన

అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్ కు తోడుగా శర్వానంద్ ప్రమోషన్

ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేషనల్ క్రష్ రశ్మిక మందన్నా

రెండు ముక్కలు దిశగా తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ?

ప్రదీప్ మాచిరాజు, చంద్రిక రవిపై స్పెషల్ మాస్ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments