Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో నాలుగు రోజులు ఓపిక పట్టండి: రజనీకాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రస్తుతం వాడీవేడీగా చర్చ సాగుతోంది. డిసెంబర్ 31వ తేదీన రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన తరుణంలో మరోసారి అభిమానుల సమ

Webdunia
గురువారం, 28 డిశెంబరు 2017 (08:58 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ప్రస్తుతం వాడీవేడీగా చర్చ సాగుతోంది. డిసెంబర్ 31వ తేదీన రజనీకాంత్ తన రాజకీయ ప్రవేశంపై  కార్యాచరణ ప్రారంభించనున్నట్లు ప్రకటించిన తరుణంలో మరోసారి అభిమానుల సమావేశంలో రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
 
తాను పదే పదే ఒకే విషయాన్ని చెబుతున్నానని ఎవరూ విసుక్కోవద్దని.. తొలుత కుటుంబం, ఆ తరువాతే మరెవరి గురించైనా ఆలోచించాలని అభిమానులకు పిలుపునిచ్చారు. మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని, తాను అన్ని విషయాలూ చెబుతానని వెల్లడించారు. ఇంకా మాట్లాడుకోవాల్సింది చాలా వుందని, ప్రతి ఒక్కరికీ వాళ్ల పిల్లలే ఆస్తి అన్నారు. పిల్లలను చదివించుకోవాలని.. తల్లిదండ్రులను గౌరవించాలని ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చారు.
 
అంతకుముందు మంగళవారం చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధరంగంలోకి దిగితే గెలిచే తీరాలని రజనీకాంత్ అన్నారు. అందుకు జనాకర్షణ ఒక్కటే సరిపోదని, పక్కా ప్లాన్ ఉండాలని కూడా ఆయన భావిస్తున్నారు. ఇకపోతే, రజనీకాంత్ తమిళనాడులో సొంత పార్టీయే పెడుతారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర పార్టీలతో పొత్తు కూడా ఉండదని సమాచారం. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments