Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అయ్యా రజినీ... ఫ్యాన్స్‌ను పిలుచుడెందుకు? క్లారిటీ ఇయ్యవయ్యా...

తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. తమిళనాడులో ఇప్పటికే సరైన నాయకుడు లేరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రజినీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 100 మందికి పైగా సీనియర్ రాజకీయ నాయకుల సలహాలు, సూచనల త

Advertiesment
అయ్యా రజినీ... ఫ్యాన్స్‌ను పిలుచుడెందుకు? క్లారిటీ ఇయ్యవయ్యా...
, శనివారం, 23 డిశెంబరు 2017 (19:14 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం దాదాపు ఖాయమైంది. తమిళనాడులో ఇప్పటికే సరైన నాయకుడు లేరని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రజినీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 100 మందికి పైగా సీనియర్ రాజకీయ నాయకుల సలహాలు, సూచనల తరువాత రజినీ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. 
 
చివరగా రజినీ ఈ నెల 26వ తేదీ నుంచి తన అభిమానులతో మరోసారి సమావేశం కానున్నారు. అది కూడా చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలోనే. రజినీ తన అభిమానులతో సమావేశం కావడానికి మరో రెండురోజులు మాత్రమే ఉంది. అందుకే ఈ గ్యాప్‌లో కూడా ఆయన కొంతమంది తన సన్నిహితులతో సమావేశమవుతున్నారు.
 
తనకు అత్యంత ఆప్తమిత్రుడు, రచయిత, రాజకీయవేత్త అయిన మణియన్‌తో రజినీ సమావేశమయ్యారు. తన ఇంటిలోనే రజినీ సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా వీరి మధ్య భేటీ సాగింది. భేటీ మొత్తం రాజకీయం గురించే జరిగినట్లు బయటకు వచ్చిన తరువాత మణియన్ మీడియాకు తెలిపారు. 
 
రజినీ రాజకీయాల్లోకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారు. అభిమానుల సమావేశం సమయంలోనే ఆ ప్రకటన ఆయన నోటి నుంచే వస్తుంది. అభిమానులు ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదంటూ మణియన్ చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్‌లో హీరో నాని "ఎంసీఏ" ఫుల్‌మూవీ